- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shocking survey : కార్పొరేట్ ఉద్యోగుల్లో ఆ లోపం..! పురుషుల్లో 57% మంది బాధితులే..
Shocking survey : కార్పొరేట్ ఉద్యోగుల్లో ఆ లోపం..! పురుషుల్లో 57% మంది బాధితులే..

దిశ, ఫీచర్స్ : మనం హెల్తీగా ఉండాలంటే శరీరానికి తగిన పోషకాలు లభించాలి. తీసుకునే ఆహారం ద్వారా ప్రొటీన్లు, విటమిన్లు అందాలి. ముఖ్యంగా విటమిన్ బి12 (Vitamin B12) చాలా అవసరం. కానీ ప్రస్తుతం మన దేశంలో 57% మంది కార్పొరేట్ ఉద్యోగాలు చేసే పురుషుల్లో ఇది లోపిస్తోందని డిజిటల్ హెల్త్ కేర్ ప్లాట్‌ఫామ్ మెడిబడ్డీ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది. ప్రధానంగా శారీరక శ్రమ లేకపోవడం, సరైన పోషకాలు తీసుకోకపోవడం వల్ల ఫేస్ చేస్తున్నారు. దీంతో దీర్ఘకాలిక అలసట(Chronic fatigue), కండరాల బలహీనత, మెదడు సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు చెబుతున్నారు.
అధ్యయనంలో భాగంగా నిపుణులు 4,400 మందిని ప్రశ్నించారు. వీరిలో 3,338 మంది పురుషులు, 1,059 మంది మహిళలు కూడా ఉన్నారు. అందరి ఆరోగ్య డేటాను విశ్లేషించిన పరిశీలకులు పట్టణ ప్రాంతాల్లోని కార్పొరెట్ ఉద్యోగుల్లో (corporate employees) పురుషులే (57%) ఎక్కువగా విటమిన్ బి12 విటమిన్ లోపం (Vitamin B12 deficiency)తో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. కాగా 50 శాతం మంది మహిళ ఉద్యోగులు కూడా విటమిన్ బి12 తగినంతగా కలిగి ఉండటం లేదని నిపుణులు పేర్కొన్నారు.
కార్పొరేట్ ఉద్యోగుల్లోనే ఎందుకు?
కార్పొరేట్ ఉద్యోగుల్లోనే విటమిన్ బి12 (Vitamin B12)ఎందుకు లోపిస్తుందో పరిశీలించిన నిపుణులు, బిజీ వర్క్ షెడ్యూల్, అధిక ఒత్తిడి, క్రమ రహిత ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం అవుతున్నాయని వెల్లడించారు. ఇక స్త్రీ, పురుషుల్లో చాలామంది బి12 విటమిన్ లోపానికి సంబంధించిన అన్‌హెల్తీ లక్షణాలు కనిపించే వరకు గుర్తించలేకపోతున్నారు.
లక్షణాలు
విటమిన్ బి12 లోపిస్తే ప్రధానంగా దీర్ఘకాలిక అలసట, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాళ్లు, చేతుల్లో జలదరింపు, తిమ్మిర్లు రావచ్చు. జ్ఞాపక శక్తి తగ్గడం (Loss of memory), ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. కోపం, చిరాకు వంటివి వేధిస్తుంటాయి. కొన్నిసార్లు నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ (Depression) వంటి పరిస్థితులకు కూడా దారితీయవచ్చు అంటున్నారు నిపుణులు. కాబట్టి విటమిన్ బి12 లోపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
ఎలా అధిగమించాలి?
విటమిన్ బి12 లోపం (Vitamin B12 deficiency) పలు అనారోగ్యాలతో ముడిపడి ఉంటుంది. లక్షణాలు కనిపిస్తే వైద్య నిపుణులను సంప్రదించ తగిన సూచనలు, సలహాలు పాటించాలి. ప్రధానంగా పోషకాల లోపంవల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి పాలు, పెరుగు, గుడ్లు, చికెన్, చేపలు, ఆకుకూరలు, తృణ ధాన్యాలు వంటి ఆహారాలు తరచుగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అట్లనే కెఫిన్, ఆల్కహాల్, అధిక చక్కెరలు కలిగిన కార్బొనేటెడ్ డ్రింక్స్ వంటివి తగ్గించాలి. తరచుగా హైడ్రేటెడ్‌గా ఉండేందుకు తగినంత వాటర్ తాగాలి. దీంతోపాటు ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం.
Read Also.. World Sleep Day : కంటినిండా కునుకులేక అవస్థలు.. దేశంలో 59% మంది పరిస్థితి ఇదే..






