Viral : పెళ్లి చేసుకోవాలా..? వామ్మో.. వద్దు బాబోయ్.. ప్రతీ నలుగురిలో ఒకరి ఫీలింగ్ ఇదే..!

by Javid Pasha |   (  Updated:2025-08-16 14:45:21  IST  )

దాదాపు 25% మంది వయోజనులు మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదని ఒక అధ్యయనం పేర్కొన్నది. కెరీర్ మీద ఫోకస్, సామాజిక పరిస్థితులు, వ్యక్తిగత అవసరాలు ఇందుకు కారణం

Viral : పెళ్లి చేసుకోవాలా..? వామ్మో.. వద్దు బాబోయ్.. ప్రతీ నలుగురిలో ఒకరి ఫీలింగ్ ఇదే..!
X

దిశ, ఫీచర్స్ : పెళ్లంటే ఒక సంబురం.. పెళ్లంటే.. ఒక సంతోషం.. పెళ్లంటే.. ఒక జీవితం.. అందుకే పెళ్లి చేసుకోరా నాయనా.. బుజ్జీ, బంగారం అని పెద్దలు అంటుంటే.. పైకి మాత్రం ఇప్పుడు వద్దూ వద్దంటూనే లోలోన మురిసిపోతూ.. ముసి ముసి నవ్వుతూ తమ ఇష్టాన్ని బయటపెట్టేసేవారు ఒకప్పుడు యువతీ యువకులైతే.. 18 ఏండ్లు దాటగానే లగ్గానికి రెడీ అయిపోయేవారే అధికంగా ఉండేది. కారణాలేమైనా ఇప్పుడు కాలం మారింది. ఒకప్పటిలా కొందరు పెళ్లికి తొందర పడకపోగా.. ఇంకొందరు పెళ్లి చేసుకుందామంటే జోడీ దొరకడం కష్టమైపోతోంది. మరి కొందరు ‘వామ్మో పెళ్లి చేసుకోవాలా.. వద్దే వద్దు బాబోయ్’ అంటున్నారు. ఇండియాలో కాస్త తక్కువ కానీ ఫారెన్ కంట్రీస్‌లో అయితే ప్రతీ నలుగురిలో ఒకరి ఫీలింగ్ మాత్రం ఇదే అంటున్నది కార్నెల్ యూనివర్సిటీ అండ్ ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఇటీవలి ఒక అధ్యయనం.

యునైటెడ్ స్టేట్స్‌లో అయితే దాదాపు 25% మంది వయోజనులు(Adults) తమ లైఫ్‌లో ఎప్పటికీ మ్యారేజ్ చేసుకోకపోవచ్చునని కూడా అధ్యయనం అంచనా వేసింది. కెరీర్ మీద ఫోకస్, మారుతున్న సామాజిక పరిస్థితులు, విలువలు, వ్యక్తిగత అవసరాలు, ఆర్థిక స్వాతంత్ర్యం, పర్సనల్ చాయిసెస్ వంటివి ఈ రకమైన ధోరణికి దారితీస్తున్నట్లు అధ్యయనం పేర్కొన్నది. నిజానికి ఒకప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండటమనేది సామాజిక కళంకంగా భావించేవారు చాలామంది. కానీ.. ఇప్పుడు చేసుకోకపోవడం వ్యక్తిగత సాధికారత, స్వేచ్ఛ, తెలివైన నిర్ణయంగా కూడా భావిస్తున్నారు పలువురు. ముఖ్యంగా ఈ రోజుల్లో యువత ఆర్థిక భద్రత (Financial security), కెరీర్, వ్యక్తిగత లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెడుతోంది.

ఒకప్పటిలా పురుషులే కాకుండా అనేకమంది మహిళలు నేడు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలని, ఫైనాన్షియల్‌గా తమకాళ్లపై తాము నిలబడాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాహం ఒక ఆర్థిక భద్రతగా, ఆనందమయ జీవితానికి భరోసాగా ఉండాలనే ఆలోచనతో పెళ్లిళ్ల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. సెటిల్ అయ్యాక సెట్ అయితే చేసుకోవడం, లేకుండా సింగిల్‌గా ఉండిపోవడం అనే రెండు ఆప్షన్లలో దేనినైనా చూస్ చేసుకోవడానికి సిద్ధ పడుతోంది. అలాగే సమాజంలో వివాహం పట్ల ఉన్న సాంప్రదాయ దృక్పథం కూడా మారుతోంది. ఒంటరిగా ఉండటమనేది ఇప్పుడు ఆత్మగౌరవంగా(Self-esteem), సెల్ఫ్ రెస్పెక్ట్‌గా (self-respect) పరిగణిస్తున్నారు. అందుకే కొందరైతే బాబోయ్ పెళ్లి వద్దే వద్దు అనే పరిస్థితి వచ్చేసిందంటున్నారు అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు. Link

Next Story