- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral : రెండు దశాబ్దాల కిందటి నవ్వుల ప్రపంచం.. NO ENTRY.. ఇప్పటికీ అలరిస్తున్న బాలీవుడ్ చిత్రం!
భిన్నమైన కథాంశంతో, గుర్తుండిపోయే డైలాగులతో, హిలేరియస్ సన్నివేశాలతో అన్ని వయసుల ప్రేక్షకులను ఫుల్లుగా నవ్వించీ.. నవ్వించీ.. ఆనందంలో ముంచెత్తిన కల్ట్ క్లాసిక్ మూవీ ‘నో ఎంట్రీ’

దిశ, ఫీచర్స్ : నవరసాల్లో హాస్యానికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక దానికి మరింత చమత్కారం, మమకారం, వెటకారం, క్రియేటివిటీ తోడైతే మనుషులను ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కోవకు చెందిన ప్రముఖ హాస్య భరిత బాలీవుడ్ చిత్రమే నో ఎంట్రీ (No entry). అనీస్ బజ్మీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్, బిపాషా బసు, ఈషా దియోల్, లారా దత్తా, సెలినా జైట్లీ వంటి మస్తు ఫేమ్ ఉన్న తారాగణంతో తెరకెక్కిన ఈ హాస్య భరిత చిత్రం ప్రేక్షక జనాన్ని నవ్వుల లోకంలో ఓలలాడించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడెందుకు గుర్తు చేసుకుంటున్నామంటే.. 2005లో రిలీజైన ‘నో ఎంట్రీ’కి సరిగ్గా 20 ఏండ్లు నిండాయి.
రెండు దశాబ్దాల కాలం గడిచినప్పటికీ, చూసిన ప్రతీసారి అలరించే సన్నివేశాలతో, ఐకానిక్ కామెడీతో నవ్వులు పూయించే చిత్రంగా ‘నో ఎంట్రీ’కి మస్తు క్రేజ్ దక్కింది. హాస్యం, స్నేహం, ప్రేమ, గందరగోళం.. ఇలా అన్ని సన్నివేశాలు ఒకే తెరపై కనిపించి ఆకట్టుకోవడం నో ఎంట్రీ మూవీని ఎల్లలు దాటిన కామెడీ చిత్రంగా మలిచిందంటారు బాలీవుడ్ సినీ విశ్లేషకులు. భిన్నమైన కథాంశంతో, గుర్తుండిపోయే డైలాగులతో, హిలేరియస్ సన్నివేశాలతో అన్ని వయసుల ప్రేక్షకులను ఫుల్లుగా నవ్వించీ.. నవ్వించీ.. ఆనందంలో ముంచెత్తి కల్ట్ క్లాసిక్‌గా మిగిలిపోయిన ‘నో ఎంట్రీ’ మూవీ చూసే ప్రేక్షకుల విషయంలో ఇప్పటికీ నవ్వుల లోకంలోకి ఎంట్రీనే..!! Link






