అదృష్టం అంటే నీదే బ్రో.. 39 రూపాయలతో ఏకంగా నాలుగు కోట్లు కొట్టేశావ్.. అద్భుతమా? ఆందోళనా?

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-05 08:18:15  IST  )

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్‌పై పెద్ద చర్చ జరుగుతోంది. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆల్మోస్ట్ ఆల్ తమకు తెలియకుండా ప్రమోట్ చేశామని ఒప్పుకున్నా.. విచారణ కొనసాగుతోంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఇందుకు

అదృష్టం అంటే నీదే బ్రో.. 39 రూపాయలతో ఏకంగా నాలుగు కోట్లు కొట్టేశావ్.. అద్భుతమా? ఆందోళనా?
X

దిశ, ఫీచర్స్ : తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్‌పై పెద్ద చర్చ జరుగుతోంది. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆల్మోస్ట్ ఆల్ తమకు తెలియకుండా ప్రమోట్ చేశామని ఒప్పుకున్నా.. విచారణ కొనసాగుతోంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన మరో న్యూస్ వైరల్ అవుతోంది. కానీ ఇది ఉత్తరప్రదేశ్‌కు చెందినది. కాగా కౌశాంబి జిల్లాకు చెందిన ఓ కుర్రాడు ఓ బెట్టింగ్ యాప్‌లో రూ. 39 పెట్టుబడిగా పెట్టి ఏకంగా నాలుగు కోట్లు గెలిచినట్లుగా న్యూస్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. నేషనల్ మీడియా హెడ్‌లైన్స్ టచ్ చేసింది. దీంతో అదృష్టం అంటే నీదే బ్రో.. బెట్టింగ్‌తో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటే, ఇంకొందరు జీవితంలో ఎన్నో కోల్పోతే నువ్వు మాత్రం డబ్బు గెలుచుకున్నావని కంగ్రాట్స్ చెప్తున్నారు.

కానీ మరోవైపు ఈ న్యూస్‌పై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇటువంటి కథలు లక్షలాది మందిని బెట్టింగ్ యాప్‌లలో చిక్కుకునేలా ప్రేరేపిస్తాయని అంటున్నారు. ఈ స్టోరీని నమ్మడం కష్టమని, ఇది తప్పుదారి పట్టించేలా ఉందని.. దీన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకుని గ్రామం మొత్తం జూదంలో మునిగిపోయి నాశనం అవుతుందని హెచ్చరించారు. జూదం, మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని.. ఇటువంటి ప్లాట్‌ఫారమ్‌లను బ్యాన్ చేయాలని సూచించారు. ఇక గెలిచిన వ్యక్తి కుటుంబ సభ్యులు అతనిని హఠాత్తుగా ప్రేమించడం ప్రారంభిస్తారని.. ఆపర్చునిస్టిక్ బిహేవియర్ గురించి చర్చించారు ఇంకొందరు.

Click For Tweet..

Next Story