Viral : మరో యువతితో భర్త సీక్రెట్ ఎఫైర్‌ను బయటపెట్టిన Chat GPT.. భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Javid Pasha |   (  Updated:2025-05-14 10:02:21  IST  )

Viral : మరో యువతితో భర్త సీక్రెట్ ఎఫైర్‌ను బయటపెట్టిన Chat GPT.. భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Viral : మరో యువతితో భర్త సీక్రెట్ ఎఫైర్‌ను బయటపెట్టిన Chat GPT.. భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఒక వ్యక్తి తన భాగస్వామికి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే.. అందుకు బలమైన కారణాలు, తగిన ఆధారాలు ఉండి ఉంటాయి అనుకుంటారు ఎవరైనా.. పైగా ఇలాంటి విషయాల్లో భ్రమలకు, ఊహలకు, మూఢనమ్మకాలకు, చెప్పుడు మాటలకు ఆస్కారం ఇవ్వరు. కానీ ఓ మహిళ మాత్రం అదే చేసింది. తన భర్తకు మరో యువతితో అక్రమ సంబంధం(Illegal affair) ఉందనే చెప్పుడు మాటలు విడాకులకు దరఖాస్తు చేసుకుంది. అలా చెప్పింది ఎవరో తెలిస్తే మీరు మరింత షాక్ అవుతారు. ఎవరో కాదు.. చాట్ జీపీటీ(Chat GPT). ఏఐని ఇలా కూడా యూజ్ చేసుకుంటారా? అని ఆశ్చర్యం అనిపించవచ్చు కానీ.. ఇది నిజం!

గ్రీస్‌(Greece)కు చెందిన ఓ జంటకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఒకరోజు ఆ ఇద్దరు పిల్లల తల్లి తన భర్త ఎలాంటి వాడో తెలుసుకోవాలనుకుంది. గ్రీక్ సంప్రదాయ జ్యోతిష్య పద్ధతి(Greek traditional astrology system) అయిన టాసియోగ్రఫీని ఆశ్రయించింది. టాసియోగ్రఫీ(Tasiography) అనేది ఒక వ్యక్తి కాఫీ తాగాక అందులో మిగిలిన టీ ఆకులు లేదా టీ పొడి వంటి పదార్థాల నమూనాలను పరిశీలించడం ద్వారా సదరు వ్యక్తి భవిష్యత్తును, అలవాట్లను, రహస్యాలను అంచనా వేసే జ్యోతిష్య పద్ధతి. ఇది పురాతన కాలంలోనిది కాబట్టి ఇప్పుడు మూఢనమ్మకంగా చాలామంది భావిస్తారు. కానీ కొందరు ఇప్పటికీ నమ్ముతుంటారు కూడా. గ్రీస్, టర్కీ, మధ్య ప్రాచ్యం వంటి ప్రాంతాల్లో ఈ సంప్రదాయం, నమ్మకం ఎక్కువగా ఉందట. కాగా అలాంటి నమ్మకం కలిగిన ఓ మహిళ తన భర్త గురించి తెలుసుకోవాలని చాట్ జీపీటీ(Chat GPT) ద్వారా టాసియోగ్రఫీని ఆశ్రయించింది.

తన భర్త గురించి జ్యోతిష్యం అడగడానికి సదరు గ్రీస్ మహిళ తన భర్త కాఫీ తాగాక మిగిలిన కాఫీ పొడి ఆకారాన్ని, గిన్నెలో, కప్పులో పేరుకుపోయిన లక్షణాలను వివరించగా.. చాట్ పీజీటీని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఏంటంటే.. ‘టాసియో గ్రఫీ ప్రకారం నీ భర్తకు మరో యువతితో ఎఫైర్ ఉంది. పైగా ఆ యువతివల్ల మీ కుటుంబానికి ఎప్పటికైనా ప్రమాదం. నీ భర్తను వదిలేయడమే బెటర్’’ అని సూచించిందట. ఇక ఈ విషయాన్ని నమ్మిన సదరు మహిళ తన భర్తతో ప్రస్తావిస్తూ వాదనకు దిగింది.. ‘అదంతా నమ్ముతావా అర్థం పర్థం లేకుండా’ అని తేలిగ్గా కొట్టిపారేశాడు భర్త. కానీ భార్య మాత్రం చాట్ జీపీటీ జ్యోతిష్యాన్ని సీరియస్‌గా తీసుకొని విడాకులకు అప్లై చేసుకుంది. ఏఐ చాట్‌బాట్(AI Chatbot) చెప్పిన దానికి చట్టపరమైన ఆధారాలు లేవని, కేసు వద్దని లాయర్ చెప్పినా వినకుండా, ఫైల్ చేయాల్సిందేనని, తనకు విడాకులు కావాల్సిందేనని పట్టుబట్టిందట. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Next Story