అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..! ప్రాపర్టీపై ఆ సంస్థ ఆసక్తికర ట్వీట్

by Javid Pasha |

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..! ప్రాపర్టీపై ఆ సంస్థ ఆసక్తికర ట్వీట్

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..! ప్రాపర్టీపై ఆ సంస్థ ఆసక్తికర ట్వీట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇండియన్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ అనే సంస్థ తన ఎక్స్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన సర్వే చేపట్టింది. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీపైనే కావడంతో ఆకట్టుకున్నది. ఇండియాలో మీరు అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ప్రాజెక్టులో ఫ్లాట్ బుక్ చేసుకుంటే అనుకున్న సమయానికి అప్పగించారా ? అని ప్రశ్నించింది. దానికి 47.2 శాతం మంది లేదని సమాధానమిచ్చారు. కేవలం 17.5 శాతం మంది మాత్రం అనుకున్న సమయానికి అప్పగించినట్టు తెలిపారు. 11.4 శాతం మంది పనులు పూర్తి చేయకుండా, కొన్నింటిని పెండింగులో పెట్టి అప్పగించారని తెలిపారు. 24 శాతం మంది మాత్రం తాము ఎప్పుడూ బుక్ చేయలేదని వెల్లడించారు. దీనిని బట్టి పెద్ద డెవలపర్లు కూడా నిర్దేశించిన లక్ష్యానికి ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతున్నారనేది స్పష్టమవుతున్నది.

Next Story