- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆహారం పోషణ కోసం మాత్రమే కాదు.. అనుబంధాలు పెంచే ఎమోషన్ కూడా !
ఆహారం పోషణ కోసం మాత్రమే కాదు.. అనుబంధాలు పెంచే ఎమోషన్ కూడా !

దిశ, ఫీచర్స్ : ఆహారం తినడం మానవ జీవన మనుగడలో భాగం. అయితే అది కేవలం ఆకలి తీర్చుకోవడానికి, శరీరానికి పోషకాలను అందించడానికి మాత్రమే కాదు, రుచికరమైన ఆహారం మానవ అనుబంధాలు, సంబంధాలు, భావోద్వేగాలతో కూడా ముడిపడి ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఇటీవలి ఒక అధ్యయనం కూడా ఫుడ్ మన భావోద్వేగాలపై పోషకాలకు మించిన ప్రభావం చూపుతుందని పేర్కొన్నది. ఆ వివరాలేంటో చూద్దాం.
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు ఆస్ట్రేలియాలో విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన 50 మంది పెద్దలను, ఆహారం ప్రాధాన్యతలు, ప్రభావాలపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆహారంతో భావోద్వేగంగా, సామాజికంగా ఎలా సంబంధం కలిగి ఉంటారో వారు అర్థం చేసుకున్నారు. భోజనం తయారీలోని పదార్థాలతో పాటు, ఎవరితో కలిసి తింటున్నాం. ఎక్కడ తింటున్నాం, ఆ భోజనం రుచి, స్వభావం, వ్యక్తిగత అవసరాలు కూడా ఆహారం విషయంలో మెదడు ప్రతిస్పందనను రూపొందిస్తాయని కనుగొన్నారు. ఉదాహరణకు సంప్రదాయ ఆహారాలు ఇంటి జ్ఞాపకాలను గుర్తుచేస్తాయని, ఒత్తిడి లేదా దుఃఖం ఆకలిని మార్చగలవని, సామూహిక భోజనాలు ఓదార్పును ఇస్తాయని తెలిపారు.
కంఫర్ట్‌ను, కనెక్షన్‌ని అందించే భాగస్వాములతో కలిసి భోజనం చేయడం ప్రత్యేక భావోద్వేగ అనుభవాన్ని సృష్టిస్తుందని పరిశోధన తెలిపింది. న్యూరోసైన్స్ నిపుణుల రీసెర్చ్ ప్రకారం.. భావోద్వేగం, జ్ఞాపకశక్తికి సంబంధించిన అమిగ్డాలా, హిప్పోకాంపస్ వంటి మెదడు భాగాలు భావోద్వేగ ప్రాముఖ్యత(Emotional significance)కలిగిన ఆహారం తీసుకునేటప్పుడు యాక్టివేట్ అవుతాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకే ఆహారం ఆహారం కేవలం శారీరక పోషణ కోసం మాత్రమే కాకుండా, సామాజిక, భావోద్వేగ అనుభవాలతో లోతుగా అల్లుకుపోయి ఉందని అధ్యయనం పేర్కొన్నది. ఇష్టమైన ఆహారం, రుచికరమైన భోజనం ప్రియమైన వ్యక్తులతో కలిసి తిన్నప్పుడు అవి మానసిక ఆనందాన్ని, వికాసాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తాయని వెల్లడించింది.






