Girlfriend effect : గర్ల్ ఫ్రెండ్‌ను చూస్తే చాలు..! 72% మంది పురుషుల్లో కలిగే ఫీల్ ఇదే..!!

by Javid Pasha |   (  Updated:2025-06-10 11:46:43  IST  )

Girlfriend effect : గర్ల్ ఫ్రెండ్‌ను చూస్తే చాలు..! 72% మంది పురుషుల్లో కలిగే ఫీల్ ఇదే..!!

Girlfriend effect : గర్ల్ ఫ్రెండ్‌ను చూస్తే చాలు..! 72% మంది పురుషుల్లో కలిగే ఫీల్ ఇదే..!!
X

దిశ, ఫీచర్స్ : ఇష్టమైన వ్యక్తులతో సహవాసం మరింత ఆనందానికి దారితీస్తుందని పెద్దలు చెబుతుంటారు. అయితే ‘ది టైమ్స్‌’లో పబ్లిషైన ఒక అధ్యయనం మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా వెల్లడించింది. ఏంటంటే.. పురుషులు ఎంత ఒత్తిడిలో, ఎంత టెన్షన్‌లో ఉన్నా సరే.. ఒక్కసారి తమ గర్ల్ ఫ్రెండ్‌ను చూస్తే చాలు. అవన్నీ క్షణాల్లో పటా పంచలైపోతాయని, పురుషులు ఒత్తిడి రహితంగా ఫీల్ అవుతారని తెలిపింది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.72% మంది పురుషులు తమ స్నేహితురాలిని లేదా ప్రియురాలిని చూసిన తర్వాత ఒత్తిడి నుంచి ఉపశమనం పొందినట్లు అధ్యయనం పేర్కొన్నది. సైకాలజిస్టుల సైతం అదే చెబుతున్నారు.

సాధారణంగానే సేమ్ జెండర్స్ కంటే అపోజిట్ జెండర్స్(Opposite sex) మధ్య ఉండే స్నేహం, ప్రేమ, సాన్నిహిత్యం, ఎమోషనల్ అటాచ్‌మెంట్స్ చాలా బలంగా ఉంటాయి. స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ అనేది ఒక సహజ లక్షణమని సైన్స్ కూడా చెబుతుంది. అయితే పురుషులు తమ ప్రియురాలిని చూసినప్పుడు ఒత్తిడి, ఆందోళలనల నుంచి ఉపశమనం పొందడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు.

సహజంగానే ప్రియమైన వ్యక్తి కళ్లముందు ఉన్నప్పుడు, ఆ వ్యక్తిని చూడటంవల్ల మెదడులో డోపమైన్(Dopamine),సెరటోనిన్ (serotonin)వంటి ఆనందానని కలిగించే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడి, టెన్షన్, ఆందోళనలను తగ్గించడం ద్వారా మానసిక ప్రశాంతత(peace of mind), సౌకర్యం(comfort), సురక్షిత భావాన్ని(sense of security) అందిస్తాయి. పురుషులు తమ ప్రియురాలని చూసినప్పుడు ఈ ప్రాసెస్ మరింత వేగంగా, అధికంగా జరుగుతుంది. అందుకే వారు ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ గర్ల్ ఫ్రెండ్‌ను చూడగానే స్ట్రెస్‌లెస్ ఫీల్(Feel stressless) అవుతారు. పరోక్షంగా ఇది అధిక రక్తపోటును నియంత్రించడం, రోగ నిరోధక శక్తి పెంచడం ద్వారా మొత్తం మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.

Next Story