- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓల్డేజ్ స్కూల్.. అక్షరంతో అమ్మమ్మలు.!
వయసు చదువుకు ఆటంకం కాదని నిరూపిస్తున్నారు.

దిశ, ఫీచర్స్: చదువుకు వయసుతో సంబంధం లేదు. మూడేళ్ల పాపనే కాదు.. మూడు తరాలు చూసిన బామ్మలు కూడా చదువుకుంటున్నారు. ఆ వయసులో వాళ్లకు చదువే అక్కర్లేదు. కానీ.. ఏ వయసు చదువుకు ఆటంకం కాదని నిరూపిస్తున్నారు.
సూరత్‌లో ఒక వీధి దీపం కాంతిలో కొందరు మహిళలు కాళ్లు మడిచి నేలపై కూర్చున్నారు. ఏముందీ అచ్చట్లు ముచ్చట్లు పెట్టుకుంటున్నారులే అనుకోవద్దు. వాళ్లందా చదువు నేర్చుకోవడానికి ఒక్కదగ్గర చేరారు. చేతిలో పెన్సిల్‌ను ఇబ్బందిగా పట్టుకొని.. పేపర్ మీద అక్షరాలను అపురూపంగా రాస్తున్నారు.
కలాతియా కల..
కళ్లు పెద్దవిగా చేసి.. ఆరాటంతో అక్షరాలను దిద్దుతున్న వాళ్లంతా వయసు పైబడిన అమ్మమ్మలు.. నాన్నమ్మలు. వారినిలా ఒక్కచోటుకు చేర్చి సరికొత్త తరగతి గదిని ప్రారంభించింది మాత్రం 48 ఏళ్ల బీనా కలాతియా. సున్నితమైన చిరునవ్వుతో.. విద్యార్థులకంటే ఎక్కువగా వాళ్లను చూసుకుంటోంది. వయసులో పెద్దవారు కాబట్టీ చిన్న పిల్లలకంటే కష్టతరం వారిని సముదాయించడం. అయినా కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా ప్రోత్సాహకరమైన మాటలతో జీవిత చరమాంకంలో చదువు నేర్చుకుంటున్న బామ్మలకు బాసటగా నిలుస్తోంది.
ఇంటి నుంచే స్టార్ట్..
బీనా విద్యా ప్రయాణం విశ్వవిద్యాలయంలో లేదా శిక్షణా సంస్థలో మొదలు కాలేదు. ఆమె ఇంటి నుంచే తన జర్నీని స్టార్ట్ చేసింది. అందరిలాగే బీనా కూడా సంవత్సరాల తరబడి వంటింటి కుందేలుగా బతికింది. ఇంటి పనులు.. పిల్లల పెంపకంతో జీవితాన్ని గడిపింది. కానీ.. పిల్లలు పెరిగి బయటకు వెళ్లిన తర్వాత ఆమె జీవితంలో ఒక మార్పు వచ్చింది. ఖాళీ సమయంలో ఆమె ఆలోచన నిస్వార్ధ సేవ వైపు మళ్లింది. సమాజం చాలాకాలంగా విస్మరించిన ఒక అవసరాన్ని నెరవేర్చాలని నిర్ణయించుకుంది. ఆ అవసరమే.. బామ్మలకు బడిపాఠాలు నేర్పించడం.
సరికొత్త ట్రెండ్
ఒకప్పుడు చాలామందికి పాఠశాలలకు వెళ్లి చదువుకునే అవకాశం లేకుండె. కానీ ఇప్పుడేమో ప్రపంచం వేగంగా మారుతుంది. ఈ జనరేషన్‌లో ఇమడలేక.. వెనకబడినట్లు భావిస్తున్నారు. కొందరేమో తమకేదీ తెలియదని అనుకుంటున్నారు. ఈ ఆలోచనను మార్చాలని బీనా నిర్ణయించుకుంది. వీధి దీపం కిందనే చదువు చెప్పడంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆసక్తి ఉన్న బామ్మలు బలపం పలక పట్టుకొని వచ్చారు. మొదట్లో సంశయించినప్పటికీ బీనా ఓపికను చూసి వాళ్లు నెమ్మదిగా అర్థం చేసుకున్నారు. అక్షరాలను పదాలుగా.. పదాలను వాక్యాలుగా మారుస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
చదుతో పాటు గౌరవం..
తొమ్మిదేళ్ల క్రితం వీధి దీపాల కింద ప్రారంభమైన ఈ ప్రయాణం.. స్థానిక "సీనియర్ సిటిజన్స్ సెంటర్" పూర్తిస్థాయి తరగతి గదిగా మారిపోయింది. ప్రతీ సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు బీనా 120 మందికి పైగా వృద్ధ మహిళలకు చదవడం.. రాయడం నేర్పిస్తోంది. వీరిలో చాలామంది ఇంతకుముందు ఎప్పుడూ పెన్సిల్.. పెన్ను పట్టుకోలేదు. ఏ ఎన్జీఓ మద్దతు లేకుండా.. స్పాన్సర్‌షిప్ బ్యానర్లు లేకుండా బీనా ఈ పాఠశాలను తన సొంత ఖర్చుతో నడుపుతోంది. తన వృద్ధ విద్యార్థులకు అక్షరాస్యతతో పాటు గౌరవం.. ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తోంది.






