- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
౩౦ ఏళ్లు దాటిన ఆడాళ్లూ.. ఇది మీకోసమే.!
పరీక్షల ద్వారా వీటిని గుర్తించవచ్చు అంటున్నారు నిపుణులు.

మహిళలకు 30 ఏళ్ల వయసొస్తే అనేక మార్పులొస్తాయి.
వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది.
ప్రారంభ దశలో వీటిని గుర్తిస్తే నివారించవచ్చు.
మూడు సాధారణ వైద్య పరీక్షల ద్వారా వీటిని గుర్తించవచ్చు అంటున్నారు నిపుణులు.
- దిశ, ఫీచర్స్
పాప్ స్మియర్ పరీక్ష (హెచ్‌పీవీ): గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. గర్భాశయ క్యాన్సర్ సాధారణంగా ముదిరే వరకు లక్షణాలు కనిపించవు. అందుకే ఈ స్క్రీనింగ టెస్ట్ అవసరం. హెచ్‌పీవీ టెస్ట్ గర్భాశయ క్యా్న్సర్లకు కారణమయ్యే వైరస్‌ను గుర్తిస్తుంది. 21ఏళ్ల వయసులో పాప్ స్మెర్ టెస్టులు చేయించుకోవడం మంచిది. ఫలితాలు నార్మల్ ఉంటే ప్రతి 3 ఏళ్లకోసారి చేయించుకోవాలి. 30 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి 5 ఏళ్లకు హెచ్‌పీవీ పరీక్షకు మారవచ్చు. లేదా రెండు పరీక్షలను ఒకేసారి చేయవచ్చు. హెచ్‌పీవీకి వ్యాక్సిన్లు వేసినప్పటికీ స్క్రీనింగ్‌లు అవసరమే.
రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్: మామోగ్రామ్స్ 40 ఏళ్ల వయసులో మొదలవుతాయి. కానీ 30 ఏళ్ల వయసులో బ్రెస్ట్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. బ్రెస్ట్ క్యాన్సర్ ఏ వయసులోనైనా రావచ్చు. నెలకోసారి అయినా బ్రెస్ట్ సెల్ఫ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్రెస్ట్ కండీషన్ ఎలా ఉంది.? తేడా ఏమైనా కనిపిస్తుందా చెక్ చేసుకోవాలి. దీనివల్ల మార్పులు.. ప్రారంభ లక్షణాలను వెంటనే గుర్తించొచ్చు. ఆ తర్వాత డాక్టర్‌ని సంప్రదించి బ్రెస్ట్ చేసుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఎంఆర్ఐ లేదా జన్యు పరీక్ష వంటి ముందస్తు స్క్రీనింగ్ గురించి డాక్టర్‌ని అడిగి సలహాలు తీసుకోవాలి.
కొలెస్ట్రాల్ స్క్రీనింగ్: గుండె జబ్బులు 30 ఏళ్లలోపు మహిళల్లో కూడా వస్తున్నాయి. ఊబకాయం.. ఫ్యామిలీ హిస్టరీ లేదా పాలిసిస్టిక్ ఓవర్ సిండ్రోమ్ (పీసీఓఎస్) వంటి ప్రమాద కారకాలున్నవారిలో ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ప్రారంభ సంకేతాలను పరీక్షించేందుకు ప్రతి 3 ఏళ్లకోసారి ఫాస్టింగ్ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. అలాగే ప్రతి 4 ఏళ్ల నుంచి 6 ఏళ్లకోసారి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి. హై కొలెస్ట్రాల్.. హై బ్లడ్ ప్రెజర్ లేదా గుండె సమస్యల హిస్టరీ ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరీక్షలు చేయించుకుంటే మంచిది.






