- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌర డ్రయ్యర్లతో రైతుల జీవితాలను మార్చేసిన 26 ఏళ్ల యువకుడు.!
7,000 రూపాయలతో 500 మంది రైతుల జీవితాల్లో మార్పు

దిశ, ఫీచర్స్: 26 ఏళ్ల స్వుయివెజో డ్జుడో అనే యువకుడు తన సైన్స్ జ్ఞానాన్ని ఉపయోగించి రైతులకు సరసమైన సౌర డ్రయ్యర్‌ను రూపొందించాడు. ఈ ఆవిష్కరణ రైతుల పంటలను కాపాడడమే కాకుండా వారి ఆదాయాన్ని పెంచి జాతీయ స్థాయిలో గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది. కేవలం 7,000 రూపాయలతో తయారైన ఈ సౌర డ్రయ్యర్ నాగాలాండ్‌లోని 500 మంది రైతుల జీవితాలను మార్చివేస్తోంది.
నష్టమే తప్ప లాభం లేదు
నాగాలాండ్‌లోని తువోపిసు గ్రామ రైతులు పండించే కివీ, టమాటోలు, ప్లమ్స్ వంటి పంటలు ప్రతీ సంవత్సరం పాడైపోయేవి. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో డ్రయ్యర్లు, రిఫ్రిజిరేటర్లను ఉపయోగించలేని పరిస్థితి రైతులది. పసుపు, మిరపకాయలు, ఔషధ మొక్కలను ఎండలో ఆరబెట్టేవాళ్లు. కానీ వర్షం లేదా కీటకాలు వాటిని నాశనం చేసేవి. కొండ ప్రాంతాల్లో ఆధునిక సాంకేతికత లేకపోవడంతో పంటల్లో తీవ్ర నష్టం వచ్చేది. పంటలు చెడిపోవడం చూడటం గుండెలు రైతులు లబోదిబోమని మొత్తుకునేవాళ్లు. పాపం.. వాళ్లు మటుకు ఏం చేయగలరు.? అప్పుడు స్వుయివెజో డ్జుడో ఒక పరిష్కారం చూపించాడు.
పరిష్కారం దిశగా
స్వుయివెజో డిమాపూర్‌లోని సెయింట్ జోసెఫ్ యూనివర్సిటీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. మామూలుగా పీజీ వరకు వెళ్లిన వాళ్లు ఏ సిటీకో వెళ్లి ఉద్యోగాన్వేషణలో మునిగిపోతారు. కానీ అతడు మాత్రం అవన్నీ వదిలేసి స్థానిక రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేశాడు. రైతులతో మాట్లాడుతూ వారి రోజువారీ సమస్యలను అర్థం చేసుకున్నాడు. విద్యుత్ లేకపోవడం వల్ల పంటలను సంరక్షించలేక, నష్టపోతున్నారని తెలుసుకున్నాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి విద్యుత్‌పై ఆధారపడని ఒక సాధనం అవసరమని నేను గ్రహించాడు.
ఆదాయం మెరుగైంది
గౌహతిలోని కిరాట్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఫెక్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం సహాయంతో స్వుయివెజో ఒక సౌర డ్రయ్యర్‌ను రూపొందించాడు స్వుయివెజో. ఇది స్థానికంగా లభ్యమయ్యే పునర్వినియోగ వస్తువులతో తయారైంది. సూర్యకాంతిని ఉపయోగించి పంటల నుండి తేమను తొలగిస్తుంది. ఎండబెట్టే పద్ధతుల్లో ధూళి, కీటకాలు, వర్షం వంటివి పంటలను నాశనం చేసే అవకాశం లేదు. పంటల నష్టం తగ్గి, షెల్ఫ్ లైఫ్ పెరిగి ఆదాయం మెరుగైంది. పంటలు వృథా కావడం లేదు. ఎండిన ఉత్పత్తుల ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు రైతులు. భారీ ఖర్చులు లేకుండా సులభ పరిష్కారంగా ఇది పని చేస్తోంది.
ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు
స్వుయివెజో డ్రయ్యర్ ధర చాలా తక్కువ. 5 అడుగుల మోడల్ ధర సుమారు 7,000 రూపాయలు. 10x10 అడుగుల పెద్ద డ్రయర్ ధర 25,000 నుంచి 30,000 ఉంటుంది. సౌర డ్రయర్ వాడకంతో రైతుల జీవితాలు మారిపోయాయి. ప్రారంభంలో రైతులు ఈ డ్రయ్యర్‌ను ఉపయోగించడానికి సంశయించారు కానీ శిక్షణ ద్వారా దాని సౌలభ్యాన్ని తెలుసుకున్నారు. ఈ ఆవిష్కరణకు 2025లో న్యూఢిల్లీలో జరిగిన పూసా అగ్రి ఫెయిర్‌లో ఐఏఆర్ఐ ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు లభించింది. ఈ అవార్డు గ్రామీణ యువత సరైన మద్దతుతో వ్యవసాయ అభివృద్ధికి దోహదం చేయగలదని ఇది నిరూపిస్తోంది.






