Viral : ఫోన్‌‌ చూసీ.. చూసీ.. మెడ కదిలించే సామర్థ్యాన్నే కోల్పోయాడు.. మీరూ జాగ్రత్త..!

by Javid Pasha |   (  Updated:2025-07-10 13:10:52  IST  )

Viral : ఫోన్‌‌ చూసీ.. చూసీ.. మెడ కదిలించే సామర్థ్యాన్నే కోల్పోయాడు.. మీరూ జాగ్రత్త..!

Viral : ఫోన్‌‌ చూసీ.. చూసీ.. మెడ కదిలించే సామర్థ్యాన్నే కోల్పోయాడు.. మీరూ జాగ్రత్త..!
X

దిశ, ఫీచర్స్ : మీ పిల్లలు గానీ, మీరు గానీ స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? గంటల తరబడి తలపైకి ఎత్తకుండా అదే పనిగా చూస్తున్నారా? అయితే జర జాగ్రత్త. అలవాటు మార్చుకోకపోతే తీవ్రమైన సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే గంటల తరబడి అలా చూస్తే చివరికి మెడ పనితీరు దెబ్బతినవచ్చు. తలపైకి ఎత్తే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోవచ్చు. తాజాగా ఓ 25 ఏండ్ల యువకుడి విషయంలో ఇదే జరిగింది. ఫోన్ చూసీ.. చూసీ.. చివరకు మెడ భాగంలో ఉబ్బడంతోపాటు మెడను కదిలించేందుకు సహకరించే కీళ్లు దెబ్బతిన్నాయి. స్కార్ట్ టిష్యూ (చర్మ సంబంధిత కణాలు) అధికంగా పేరుకొని, కండరాలు పూర్తిగా పనిచేయకుండా స్తంభించిపోయాయి. ఈ అరుదైన స్థితినే వైద్య పరిభాషలో ‘డ్రాప్డ్ హెడ్ సిండ్రోమ్’ (DHS)గా పిలుస్తారు. ప్రస్తుతం ఇందుకు సబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తరచుగా గంటల తరబడి ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు వంటి వాటిని తలకిందకు వంచి చూసే పరిస్థితి కారణంగా డ్రాప్డ్ హెడ్ సిండ్రోమ్ (Dropped Head Syndrome - DHS) వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మాసికులర్ డిస్ట్రోఫీ, పార్కిన్సన్స్, లేదా ఇతర న్యూరోమాస్కులర్ రుగ్మతలవల్ల కూడా రావచ్చు. దీనిబారిన పడిన వారు ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. సాధారణ బరువును కూడా కోల్పోతారు. మెడ కండరాల బలహీనత వల్ల తలను సమానంగా ఎత్తే సామర్థ్యాన్ని కూడా కోల్పోతారు.

పరిష్కారం ఏమిటి?

*పునరావర్తన చికిత్స(Recurrence treatment) : డాక్టర్లను సంప్రదిస్తే తగిన వైద్యం అందిస్తారు. ఫిజియోథెరపీ ద్వారా మెడ కండరాల బలాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు.

*నెక్ కాలర్లు: తలకు సపోర్ట్‌గా మెడకండరాలు బలపడే వరకు తాత్కాలికంగా ఉపయోగించాలని వైద్య నిపుణులు సూచిస్తారు.

* ఔషధాలు : కండరాల బలహీనతను నివారించే మందులు సూచిస్తారు.

*శస్త్రచికిత్స : తీవ్రమైన సందర్భాల్లో, మెటల్ రాడ్లు, స్క్రూలు ఉపయోగించి మెడను సవరించే ఆపరేషన్ అవసరం అవుతుంది.

*జాగ్రత్తలు: ఫోన్ వాడే సమయాన్ని తగ్గించడం, కంప్యూటర్ ముందు కూర్చునే భంగిమ సరిగ్గా ఉండేలా చూసుకోవడం(maintain proper sitting posture) చాలా ముఖ్యం. Link

Next Story