20 ఏళ్లకే.. యూత్ సెన్సేషన్.!

by Daayi Srishailam |

ఆ కుర్రాడెవరు.. ఏం చేశాడు.?

20 ఏళ్లకే.. యూత్ సెన్సేషన్.!
X

40 ఏళ్ల వయసొచ్చినా..

కెరీర్‌లో సెట్ అవ్వరు కొందరు.

ఆ వయసులో..

కొత్త కోర్సుల వెంట పరుగులు తీస్తుంటారు.

కానీ..

ఒక కుర్రాడు 20 ఏళ్లకే సెన్సేషన్ అయ్యాడు.

ఇంతకూ ఆ కుర్రాడెవరు.. ఏం చేశాడు.?తెలుసుకుందామా.?

- దిశ, ఫీచర్స్

ఇంటర్నెట్‌లో బాగా శోధిస్తున్న ఆ కుర్రాడి పేరు సాయి అభ్యంకర్. మామూలుగా 20 ఏళ్ల వయసు కుర్రాడంటే ఇంటర్ పూర్తయి అప్పుడే ఇంజినీరింగ్లో చేరి.. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తారు. కానీ.. సాయి అభ్యంకర్ అంత చిన్న వయసులో కెరీర్‌లోనే ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్టు సంపాదించి యూత్ ఐకాన్‌‌గా మారాడు.

మ్యూజిక్ డైరెక్టర్‌గా..

ఒక క్రేజీ ప్రాజెక్ట్ అల్లు అర్జున్.. అట్లీ కుమార్ కాంబినేషన్. "పుష్ప-2"తో అల్లు అర్జున్ ఒక సెన్సేషన్. అట్లీ కుమార్ భారతీయ సినీ సంచలనం. మరీ ముఖ్యంగా తమిళంలో ఫ్లాప్ లేని యంగ్ డైరెక్టర్ అట్లీ. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే ఎవరికైనా ఆసక్తి రెట్టింపవుతుంది. అయితే వాళ్లు తీయబోయే సినిమా విషయంలో వాళ్లంటే సాయి అభ్యంకర్ అనే కుర్రాడి గురించే ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది బయట. ఎందుకంటే ఈ క్రేజీ ప్రాజెక్టులోకి సాయి అభ్యంకర్ ఎంట్రీ ఇచ్చాడు. సంగీత దర్శకుడిగా పేరు అనౌన్స్ చేయలేదు కానీ.. సంగీతం సమకూర్చేది మాత్రం సాయి అభ్యంకరే.

ఒక్క సినిమా చేయలేదు..

సాయి అభ్యంకర్ గురించి అంతగా చర్చించాల్సిన అవసరం ఏంటీ అనంటే.. ఫస్ట్ అతడి వయసు. కేవలం 20 ఏళ్లకే సినీ సంగీత దర్శకుడిగా అవకాశం దొరికింది అంటే అతడి టాలెంట్ ఏందో అర్థం చేసుకోవచ్చు. సెకండ్.. అతడు ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. డైరెక్టర్.. హీరో ఇద్దరూ మంచి సక్సెస్ ట్రాక్‌లో ఉన్నవాళ్లే. లేనిపోని ఎక్సపరిమెంట్లు ఎందుకనీ పాతవారితోనో.. లేక వాళ్లకు కలిసొచ్చే మ్యూజిక్ డైరెక్టర్‌తోనే కానిచ్చేస్తారు. కానీ.. అలా కాకుండా ఒక ఫ్రెషర్‌కి ఛాన్స్ ఇచ్చారంటే అతడిలో టాలెంట్ ఉన్నట్టే కదా.?

యువత నేర్చుకోవాలి

20 ఏళ్ల వయసులో "పాన్ ఇండియా" స్థాయిలో వచ్చే సినిమాకు సంగీతం సమకూర్చే బాధ్యత తీసుకుంటున్నాడంటే ఒకసారి యువత ఆలోచించండి. చదువుకోవడం అంటే అమాంతం కాలేజీకి వెళ్లడం.. లెసన్స్ వినడం.. ఇంటికొచ్చి టైంపాస్ చేయడం కాదు. చదువుతో పాటు ఎక్స్‌ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ నేర్చుకుంటే అవి కెరీర్‌నే మలుపు తిప్పే అవకాశం ఉంది. అలాంటి అంశాల పట్ల పట్టు లేకపోవడం వల్లనే పీజీలు.. పీహెచ్డీలు చేసి.. వయసు మించిపోయి చాలామంది సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాల్లేక నానా అవస్థలు పడుతున్నారు. కాబట్టీ చదువుతూనే ఇంకో అదనపు స్కిల్స్ నేర్చుకోవాలి.

పేరెంట్స్ సింగర్స్..

సక్సెస్ అంత ఈజీ కాదు. కష్టపడాలి.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కొన్నిసార్లు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా పనిచేస్తుంది. సాయి అభ్యంకర్‌కు టాలెంట్‌తో పాటు.. కుటుంబ నేపథ్యమూ పనిచేసింది. సాయి వాళ్ల నాన్న టిప్పు. తెలుగు.. తమిళ్.. కన్నడ.. హిందీ భాషల్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడారాయన. ఇక సాయివాళ్ల అమ్మ హరిణి కూడా పాపులర్ సింగర్. ఏఆర్ రెహమాన్.. మణిశర్మ.. హరీస్ జయరాజ్.. దేవిశ్రీ ప్రసాద్.. జీవీ ప్రకాశ్.. తమన్.. మిక్కీ జే మేయర్ సంగీతంలో ఎన్నో పాటలు పాడారు. వీళ్లిద్దరిని చూస్తూ పెరిగిన సాయి సంగీతంలో ఆరితేరాడు.

అంతకు ముందే..

మ్యూజిక్ డైరెక్టర్‌గా సాయి అభ్యంకర్ అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్లోనే కాదు.. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్‌సీయూ)లో లాఘవ లారెన్స్ హీరోగా బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్న "బెంజ్"తో పాటు సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న సినిమా.. ప్రదీప్ రంగనాథన్.. మమితా బైజు సంటగా నటిస్తున్న సినిమాలు ఒప్పుకున్నాడు సాయి అభ్యంకర్. సంగీత దర్శకుడిగా సాయి చేసిన సినిమా ఒక్కటి కూడా ఇంకా విడుదల కాలేదు. కానీ ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. "కట్చి సేరి" పాటతో సాయి అభ్యంకర్ సంగీతాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అది 220 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆ తర్వాత "ఆశ" అనే సాంగ్ 245 మిలియన్ వ్యూస్ సాధించింది. మీనాక్షి చౌదరి నటించిన మ్యూజిక్ సింగిల్ "సితిరా పుతిరి"కి కూడా సాయి సంగీత దర్శకుడు. "దేవర".. "కూలీ"తో పాటు అనిరుధ్ రవిచందర్ దగ్గర కొన్ని సినిమాలకు అడిషనల్ ప్రోగ్రామర్ కింద పనిచేశాడు.

Next Story