సండే మిషన్.. డాల్ లేక్‌ పరిరక్షణలో 14 ఏళ్ల జన్నత్.!

by Daayi Srishailam |

గ్లవ్స్ ధరించి.. నెట్ పట్టుకుని డాల్ సరస్సును శుభ్రం చేసే పనికి శ్రీకారం చుట్టింది

సండే మిషన్.. డాల్ లేక్‌ పరిరక్షణలో 14 ఏళ్ల జన్నత్.!
X

దిశ, ఫీచర్స్: కాశ్మీర్‌లోని డాల్ లేక్‌ది ప్రపంచ ప్రసిద్ధి చెందిన సౌందర్యం. హౌస్‌బోట్లు.. షికారా.. పర్యాటకులు ఇవన్నీ దీని జీవనాడి. కానీ ఈ అందమైన సరస్సు ఇప్పుడు ప్లాస్టిక్.. మురుగునీరు.. ఆక్రమణలతో మునిగిపోయింది. 14 ఏళ్ల జన్నత్ పట్లూ అనే బాలిక ప్రతీ ఆదివారం ఉదయం గ్లవ్స్ ధరించి.. నెట్ పట్టుకుని డాల్ సరస్సును శుభ్రం చేసే పనికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడామె దేశవ్యాప్త సంచలనం.

సండే సరస్సుకే అంకితం..

జన్నత్ వాళ్ల నాన్న తారిక్ అహ్మద్ పట్లూ హౌస్‌బోట్ ఓనర్. 25 ఏళ్ల క్రితం షికారా నడుపుతుండగా ఒక విదేశీ పర్యాటకుడు సిగరెట్ ప్యాకెట్ తీస్తున్న దృశ్యం చూశాడు. మనం పారడైస్‌గా భావించే సరస్సును మనమే నాశనం చేస్తున్నాం అనిపించింది అతడికి. అప్పట్నుంచి స్వచ్ఛందంగా శుభ్రత కార్యక్రమాలు చేయడం ప్రారంభించాడు. జన్నత్ ఐదేళ్ల వయసులో వాళ్ల నాన్నను అనుసరించి ప్లాస్టిక్, కలుపు తీస్తూ సహాయం చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు లింటన్ హాల్ పబ్లిక్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న జన్నత్.. ప్రతిరోజూ శుభ్రతలో పాల్గొంటోంది. ఇక ఆదివారాలైతే పూర్తిగా సరస్సుకే అంకితం అవుతోంది.

ఫ్లోటింగ్ ఆంబులెన్స్..

2020లో కరోనా వచ్చినప్పుడు తారిక్ వైరస్ బారిన పడ్డాడు. కానీ ఆ సమయంలోనే తన షికారాను ''ఫ్లోటింగ్ ఆంబులెన్స్''గా మార్చాడు. ఎన్‌జీవో సహాయంతో లౌడ్‌స్పీకర్ అమర్చి సరస్సు లోతట్టు గ్రామాలకు రోగులను తరలించాడు. స్వతహాగా మందులు అందించాడు. అంతేకాదు కరోనా పేరు చెప్తెనే భయపడుతున్న వాళ్లకు భద్రతా సలహాలు ఇచ్చాడు. తారిక్ సేవలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించాడు. సరస్సు సంరక్షణ నుంచి మానవత్వ సేవ వరకు ఒక వ్యక్తి చేస్తున్న సేవలను కొనియాడారు. ఇప్పుడు జన్నత్‌ ఆ వారసత్వాన్ని కొనాసగిస్తోంది.

సరస్సు పరిరక్షణ బాధ్యత..

ఒక్క జన్నత్ కుటుంబమే కాదు. వారిలాంటి హౌస్‌బోట్ ఓనర్లు.. షికారా నడిపే వాళ్లెంతోమంది డాల్ లేక్‌పై ఆధారపడి బతుకుతున్నారు. సరస్సు మునిగిపోతే పర్యాటకులు రారు. ఆదాయం ఉండదు. అందుకే జన్నత్ ఈ కార్యక్రమాన్ని ఎంచుకుంది. ఒకప్పుడు రైనావారీ ప్రాంతంలో దుర్వాసన ఎక్కువగా ఉండేది. కానీ ఆమె శుభ్రత కార్యక్రమాలు నిర్వహించింది. ఇప్పుడు ఆ ప్రాంత సుందరంగా మారిపోయింది. పర్యాటకులు తరలి వస్తున్నారు. మురుగునీరు.. ఆక్రమణలు వల్ల డాల్ లేక్ నాశనం అవుతుందని అందరికీ చెప్తోంది. సరస్సు పరిరక్షణ అందరి బాధ్యత అని చాటిచెప్తోంది.

డాల్ లేక్ ఫర్ ది సండే..

జన్నత్ సేవలను కూడా మోదీ మన్ కీ బాత్‌లో ఆమెను ప్రశంసించాడు. తెలంగాణ స్టేట్ బోర్డ్ పాఠ్యపుస్తకంలో 3వ తరగతి ఇంగ్లీష్ లెసన్ "జన్నత్‌స్ ఝీల్"గా చేర్చారు. ఆమె కథ పర్యావరణ బాధ్యత సందేశం ఇస్తుంది. జన్నత్ అందరికీ స్ఫూర్తినిస్తోంది. ఐదేళ్ల నుంచి శీతాకాలంలో కూడా ప్లాస్టిక్ తీస్తుంది. అందరూ పర్యావరణాన్ని పాడుచేస్తే జన్నత్ పర్యాటకులకు సౌందర్యం చూపిస్తోంది. సరస్సును కాపాడుతోంది. తన "డాల్ లేక్ ఫర్ ది సండే" క్యాంపెయిన్‌కు ఎన్విరాన్‌మెంటల్ యాక్టివిస్టులు కూడా మద్దతిస్తున్నారు. చిన్న వయసులోనే జన్నత్ డాల్ లేక్‌కు గ్రీన్ అంబాసిడర్ కావడం నిజంగానే స్పూర్తిదాయకం.

Next Story