చలి పుట్టిస్తోంది..

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-11-07 21:24:41  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చలి గిలి పుట్టిస్తోంది. క్రమంగా ఉష్టోగ్రతలు పడిపోతుండటంతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పొగ మంచు చంపేస్తోంది. చలిగాలులు వీస్తుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ ఏరియాలో ఇవాళ ఉదయం దట్టంగా పొగమంచు కమ్ముకుంది. పాడేరు 9, మినుములూరు 11డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతం విషయానికొస్తే చలి వణుకు పుట్టిస్తోంది. పొగమంచు కారణంగా దారులు కూడా [&hellip;]</p>

చలి పుట్టిస్తోంది..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చలి గిలి పుట్టిస్తోంది. క్రమంగా ఉష్టోగ్రతలు పడిపోతుండటంతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పొగ మంచు చంపేస్తోంది. చలిగాలులు వీస్తుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ ఏరియాలో ఇవాళ ఉదయం దట్టంగా పొగమంచు కమ్ముకుంది. పాడేరు 9, మినుములూరు 11డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఇక ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతం విషయానికొస్తే చలి వణుకు పుట్టిస్తోంది. పొగమంచు కారణంగా దారులు కూడా కనిపించడం లేదని సమాచారం. తిర్యాణి, గిన్నెదరిలో 9.7 కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా ఉదయం పూట చలితీవ్రత పెరిగింది. సాయంకాలం చల్లగాలులు వీస్తుండటంతో నగరవాసులు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు సుముఖత వ్యక్తంచేయడం లేదని తెలుస్తోంది.

Next Story