ఆదిపురుష్ లక్ష్మణుడు అతనే..

by  |
ఆదిపురుష్ లక్ష్మణుడు అతనే..
X

దిశ, వెబ్‌డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా మూడు ప్రాజెక్టులు చేస్తున్నాడు. ‘రాధే శ్యామ్, ఆదిపురుష్’తో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో మరో మూవీ చేస్తున్నాడు. ‘రాధే శ్యామ్’ షూటింగ్ ఎండింగ్‌కు చేరుకోగా.. ‘ఆదిపురుష్’ కాస్టింగ్ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్లు అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. 2022 ఆగస్ట్ 11న సినిమా రిలీజ్ అవుతుందని కూడా అధికారికంగా ప్రకటించిన దర్శక, నిర్మాతలు.. మిగతా కాస్ట్ గురించి మాత్రం సస్పెన్స్‌లోనే పెట్టేశారు.

ఈ క్రమంలో రాముడి తమ్ముడు లక్ష్మణుడి పాత్ర గురించి గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్యారెక్టర్‌కు బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ ఫైనల్ అయినట్లు బీటౌన్ టాక్. ‘దిల్ తో బచా హై జీ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సన్నీ సింగ్.. ‘ప్యార్ కా పంచనామా 2’ ద్వారా ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ‘సోనూ కే టిటు కీ స్వీటీ’ సినిమా తన కెరియర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

కాగా, టి సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫైల్స్ బ్యానర్స్‌పై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మిస్తున్న సినిమా.. 2021 జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ లోపు మెయిన్ కాస్ట్ ఎవరనే దానిపై అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed