లావణ్య ‘వింటర్ లవ్’

by  |
లావణ్య ‘వింటర్ లవ్’
X

దిశ, వెబ్‌డెస్క్: అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సూపర్ కూల్ ఆన్సర్స్ ఇచ్చిన లావణ్య.. శీతాకాలం అంటే చాలా ఇష్టమని చెప్పింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన భామ చిన్నప్పటి నుంచి అదే వెదర్ ఎంజాయ్ చేస్తూ పెరిగానని.. అందుకే వింటర్ సీజన్‌ను లవ్ చేస్తానని తెలిపింది.

దేశీ గర్ల్‌గా ఉండేందుకు ఇష్టపడే తాను దేశీ ఫుడ్‌నే ఇష్టపడతానని.. పప్పు, గ్రీన్ చట్నీ ఉంటే చాలు ఫుల్‌గా తినేస్తానని చెప్పింది. ప్రస్తుతం ‘చావు కబురు చల్లగా’ షూటింగ్‌ ఎంజాయ్ చేస్తున్న భామ.. లేట్ నైట్ షూటింగ్స్ కంఫర్ట్‌గా ఫీల్ అవుతానని అంటోంది. తన బ్యూటీ సీక్రెట్స్ గురించి చెప్పమని అభిమానులు కోరగా.. ముందు స్కిన్ హెల్తీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, అప్పుడే మేకప్ వేస్తే బాగా కనిపిస్తుందని చెప్పింది. హెల్తీ స్కిన్ లేకుండా మేకప్ వేసుకున్నా సరే అందంగా కనిపించలేమని సలహా ఇచ్చింది. ఇక తన సొట్టబుగ్గలు అందంగా ఉన్నాయని ఫ్యాన్స్ చెప్పగా.. సిగ్గుపడుతూ థాంక్స్ చెప్పింది అందాల రాక్షసి.

కాగా హాకీ బ్యాక్ డ్రాప్‌లో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ చేస్తున్న లావణ్య ఈ మధ్యే షూటింగ్ ఫినిష్ చేసింది. దీంతో పాటు తమిళ్, తెలుగు ప్రాజెక్ట్‌లతో బిజీబిజీగా ఉంది భామ.


Next Story

Most Viewed