డీగ్లామర్ లుక్‌లో ‘లావణ్య’

by  |
డీగ్లామర్ లుక్‌లో ‘లావణ్య’
X

దిశ, వెబ్‌డెస్క్: లవ్లీ బ్యూటీ ‘లావణ్య త్రిపాఠి’ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఇటీవలే ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ మూవీ షూటింగ్ పూర్తి చేసిన ఈ అందాల రాక్షసి.. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయతో కలిసి ‘చావు కబురు చల్లగా’లో నటిస్తోంది. లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, హీరో ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదల కాగా, వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. తాజాగా చిత్రబృందం హీరోయిన్ లావణ్య ఫస్ట్ లుక్‌ కూడా రివీల్ చేసింది. ఈ చిత్రంలో ‘మల్లిక’గా పేదింటి అమ్మాయి పాత్రలో కనిపించనుండగా, ఈ విషయాన్ని ‘చావు కబురు చల్లగా సినిమాలో.. బస్తీ బాలరాజుతో మల్లిక’ అని ఇన్‌స్టా వేదికగా తన అభిమానులతో పంచుకుంది లావణ్య.

నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ళ‌పాటి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో యంగ్‌ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం, సునీల్ రెడ్డి ఫొటోగ్రఫీని అందిస్తున్నారు. ఆమ‌ని, శ్రీకాంత్ అయ్యంగ‌ర్‌, మ‌హేష్‌, భ‌ద్రం, మురళీ శర్మలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.



Next Story

Most Viewed