- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉచిత అంబులెన్స్ సేవలను మంగళవారం సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ భాగస్వామ్యంతో ఈ అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కొవిడ్ -19 బాధితులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. రెండు అంబులెన్స్ లు 24గంటల పాటు అందుబాటులో ఉంటాయన్నారు. 94906 17234, 94906 17111 […]</p>

దిశ, క్రైమ్‌బ్యూరో: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉచిత అంబులెన్స్ సేవలను మంగళవారం సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ భాగస్వామ్యంతో ఈ అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కొవిడ్ -19 బాధితులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. రెండు అంబులెన్స్ లు 24గంటల పాటు అందుబాటులో ఉంటాయన్నారు. 94906 17234, 94906 17111 నెంబర్లకు కాల్ చేసి సేవలు పొందాలన్నారు. కార్యక్రమంలో రాచకొండ కమిషనరేట్ అడిషనల్ సీపీ సుధీర్ బాబు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ప్రధాన కార్యదర్శి కృష్ణ, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ (ఆర్కేఎస్సీ) వైస్ చైర్మన్ గగన్ డీపీ కోహ్లీ, యువత ఎన్జీవో ప్రతినిధులు సాకేత్, ప్రశాంత్, దాస్ గుణాలన్ పాల్గొన్నారు.






