క‌ష్ట‌ప‌డి చ‌దివి అమెరికా వెళ్లింది.. అంత‌లోనే

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-09 05:00:50  IST  )

ఎన్నో క‌ల‌ల‌తో క‌ష్ట‌ప‌డి చ‌దివి అమెరికా వెళ్లిన యువ‌తి ఆ క‌లలు నెర‌వేర‌కుండానే అనారోగ్యంతో క‌న్నుమూసింది. ఈ ఘ‌ట‌న బాప‌ట్ల జిల్లా కారంచేడు గ్రామంలో విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన రైతు యార్ల‌గ‌డ్డ రామ‌కృష్ణ‌, వీణాకుమారిల‌కు రాజ్య‌ల‌క్ష్మి అనే కుమార్తె ఉంది.

క‌ష్ట‌ప‌డి చ‌దివి అమెరికా వెళ్లింది.. అంత‌లోనే
X

దిశ‌, వెబ్ డెస్క్: ఎన్నో క‌ల‌ల‌తో క‌ష్ట‌ప‌డి చ‌దివి అమెరికా వెళ్లిన యువ‌తి ఆ క‌లలు నెర‌వేర‌కుండానే అనారోగ్యంతో క‌న్నుమూసింది. ఈ ఘ‌ట‌న బాప‌ట్ల జిల్లా కారంచేడు గ్రామంలో విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన రైతు యార్ల‌గ‌డ్డ రామ‌కృష్ణ‌, వీణాకుమారిల‌కు రాజ్య‌ల‌క్ష్మి అనే కుమార్తె ఉంది. బీటెక్ పూర్తి చేసిన రాజ్య‌ల‌క్ష్మి ఎంఎస్ చేసేందుకు అమెరికాకు వెళ్లింది. వ్య‌వ‌సాయ కుటుంబం కావ‌డంతో కుమార్తెను అప్పులు చేసి మ‌రీ తండ్రి విదేశాల‌కు పంపించారు.

రాజ్య‌ల‌క్ష్మి కూడా క‌ష్ట‌ప‌డి చ‌దువుతూ మాస్ట‌ర్స్ పూర్తి చేసింది. ప్ర‌స్తుతం ఉద్యోగ ప్ర‌య‌త్నంలో ఉండ‌గా రెండు మూడు రోజులుగా ద‌గ్గు, ఛాతిలో నొప్పి వ‌చ్చిన‌ట్టు స్నేహితుల‌తో చెప్పిన‌ట్టు తెలుస్తోంది. కాగా శుక్ర‌వారం రాత్రి రాజ్య‌ల‌క్ష్మి నిద్ర‌పోగా నిద్ర‌లోనే క‌న్నుమూసింది. కూతురు మ‌ర‌ణ‌వార్త తెలిసి తల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. చేతికొచ్చిన కూతురు మ‌ర‌ణించ‌డంతో గుండె ప‌గిలేలా ఏడుస్తున్నారు. అంతే కాకుండా మృత‌దేహాన్ని అమెరికా నుండి తీసుకువ‌చ్చేందుకు సైతం త‌ల్లిదండ్రులు ఇబ్బందిప‌డుతున్నారు.


Next Story