- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్నేహం కోసం... ఎంత పని చేశాడంటే...
by Kema Shiva Kumar |
తన ప్రాణానికి ప్రాణమైన తన స్నేహితుడి చితిలోకి దూకి ఓ వ్యక్తి ప్రాణ త్యాగానికి పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఖంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తన ప్రాణానికి ప్రాణమైన తన స్నేహితుడి చితిలోకి దూకి ఓ వ్యక్తి ప్రాణ త్యాగానికి పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఖంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అశోక్(42) అనే వ్యక్తి గత కొంత కాలంగా కేన్సర్ తో బాధపడుతూ మృతిచెందాడు. యమునా నది తీరంలో జరిగిన అంత్యక్రియల్లో అతని మిత్రుడు ఆనంద్(40) పాల్గొన్నాడు. అశోక్ మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆనంద్ అకస్మాత్తుగా చితిలోకి దూకాడు. దీంతో పక్కనున్న వారు బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం డాక్టర్ల సూచన మేరకు ఆగ్రాకు తీసుకెళ్తుండగా ఆనంద్ మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు.
- Tags
- friendship
- work
Next Story






