Chicken: ఊపందుకున్న చికెన్ సేల్స్.. పెరిగిన ధర

by Yella Dhawani Reddy |

బర్డ్ ఫ్లూ (Bird flu) ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ సేల్స్ (Chicken sales) భారీగా పడిపోయాయి.

Chicken: ఊపందుకున్న చికెన్ సేల్స్.. పెరిగిన ధర
X

దిశ, వెబ్ డెస్క్: బర్డ్ ఫ్లూ (Bird flu) ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ సేల్స్ (Chicken sales) భారీగా పడిపోయాయి. ఫలితంగా ధరలు కూడా భారీగా దిగొచ్చాయి. అయితే, ఇది అంతా వారం రోజుల క్రితం సంగతి. ఎండలు పెరగటంతో బర్డ్ ఫ్లూ తగ్గుముఖం పట్టింది. దీంతో చికెన్ కొనుగోళ్లు కూడా ఊపందుకున్నాయి. ఈ క్రమంలో చికెన్ ధరలు (Chicken prices) కూడా పెరిగాయి.

ఆదివారం కావటంతో మాంసం ప్రియులు చికెన్ షాపులకు క్యూ కట్టారు. దీంతో గత నెల రోజులుగా వెలవెలబోయిన చికెన్ షాపులు కలకలాడుతున్నాయి. కాగా, తెలుగు రాష్ట్రాల్లో కేజీ చికెన్ ధరపై రూ.50 వరకు పెరిగింది. అయితే, ఇన్ని రోజులుగా చికెన్‌కు దూరమైన మాంసాహారాలు ధరలను పట్టించుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. కొనుగోళ్లు ఇలానే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్లు నిపుణులు చెబుతున్నారు. వారం క్రితం కిలో రూ.850లు ఉన్న మటన్ రేటు ప్రస్తుతం కిలో రూ.1000కి చేరింది. హైదరాబాద్‌ నగరంలో చేపల ధరల విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. కిలో రూ.50 నుంచి 100 పెరిగింది.

కాగా, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెలరోజులుగా దాదాపు 50 శాతం కంటే ఎక్కువగానే సేల్స్ పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ క్రమంలో డిమాండ్ పెరగడంతో మటన్, ఫిష్ సేల్స్ పెరిగినట్లు తెలిపారు.

Next Story