తిరుపతిలో దారుణం.. కరోనా నుంచి కోలుకున్నా ఇంట్లోకి రానివ్వట్లే

by  |
తిరుపతిలో దారుణం.. కరోనా నుంచి కోలుకున్నా ఇంట్లోకి రానివ్వట్లే
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో గత కొద్దిరోజుల నుంచి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అంతేస్థాయిలో రికవరీ రేటు పెరుగుతోంది. అయితే కరోనా సోకి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినవారిపై కొందరు వ్యక్తులు చిన్నచూపు చూస్తున్నారు. అంతేకాదు వారిని ఏదో నేరం చేసినవారిలా చూస్తున్నారు. కొందరి వ్యక్తుల వ్యవహారం మరీ అద్వానంగా ఉంది. తాజాగా తిరుపతిలో ఓ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉన్న సుందరయ్యనగర్ లో ఓ కుటుంబం కిరాయికి ఉంటుంది. అయితే వారికి కరోనా సోకింది. దీంతో ఆ కుటుంబమంతా కూడా పది రోజులపాటు క్వారంటైన్ లో ఉన్నారు. అనంతరం మళ్లీ టెస్టులు చేయించుకోగా నెగెటివ్ గా రిపోర్టు వచ్చింది. దీంతో ఆ ఫ్యామిలీ తిరిగి తమ ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ సమయంలో ఆ ఇంటి యజమాని వారిని అడ్డుకున్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే.. మీకు కరోనా వచ్చింది.. మీరు రావొద్దంటూ వారిని రోడ్డుపైనే నిలబెట్టాడు. కరోనా నుంచి మేం రికవరీ అయ్యామని వారు అతనికి ఎంత సర్ధిచెప్పినా కూడా వారిని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు.



Next Story