కూలీలను ఇంటి అద్దె అడగొద్దు: కేంద్రం

by  |
కూలీలను ఇంటి అద్దె అడగొద్దు: కేంద్రం
X

న్యూఢిల్లీ : వలస కార్మికులు, పేద కూలీల నుంచి ఒక నెల ఇంటి అద్దెను యజమానులు డిమాండ్ చేయొద్దని కేంద్రం ఆదేశించింది. ఈ ఆదేశాన్ని ఉల్లంఘించిన యజమానులు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే వారు చేసిన పనికి ఎటువంటి కోత లేకుండా పూర్తి వేతనాలు అందించాలని తెలిపింది. ఇప్పటికే స్వగ్రామానికి బయలుదేరిన వలస కార్మికులకు.. ఆయా రాష్ట్రాలు షెల్టర్లు ఏర్పాటు చేయాలని, ఆహారాన్ని అందించాలని కేంద్ర హోం వ్యవహారాలు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సమీపంలోని ప్రభుత్వ క్వారంటైన్ వసతిలో వారిని పర్యవేక్షించాలని సూచించింది. లాక్ డౌన్ లో సందర్భంగా వలస కార్మికులు ఎదుర్కొంటున్న దుస్థితిపట్ల కేంద్రం పై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.

Tags: Lockdown, migrant workers, rent, landlords


Next Story

Most Viewed