ప్రముఖ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. భద్రతను కట్టుదిట్టం

by Disha Web Desk 12 |
ప్రముఖ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. భద్రతను కట్టుదిట్టం
X

దిశ, వెబ్ డెస్క్: సోమవారం దక్షిణ గోవాలోని దబోలిం విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఇ-మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు, పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. విమానాశ్రయ ప్రాంగణం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీని ద్వారా.. అయితే, గోవా విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రభావితం కాలేదని విమానాశ్రయ అధికారులు ధ్రువీకరించారు. గోవా ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎస్‌విటి ధనమ్‌జయరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్‌పోర్టులో బాంబు ఉన్నట్టు ఉదయం ఆయన కార్యాలయానికి ఇమెయిల్ వచ్చింది. మేము ఇప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. విమానాశ్రయంలో భద్రతను పెంచినప్పటికీ, విమాన కార్యకలాపాలు ప్రభావితం కాలేదని ఆయన తెలిపారు. గోవా పోలీసులు విమానాశ్రయ అధికారుల నుంచి ఫిర్యాదును స్వీకరించారు. వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను విమానాశ్రయానికి పంపారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed