రిజిస్ట్రేషన్లు సులభతరం..

by  |
రిజిస్ట్రేషన్లు సులభతరం..
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం దసరా నాటికి ‘ధరణి’ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానుంది. వ్యవసాయ భూముల లావాదేవీలు తహసీల్దార్ కార్యాలయంలోనే జరుగుతాయి. జాయింట్ రిజిస్ట్రార్ హోదాలో తహసీల్దార్ ఆ ప్రక్రియను పూర్తి చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మ్యూటేషన్ చేస్తారు. అప్పటికప్పుడే పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు. దీనికి రూ.150 ఫీజుగా నిర్ణయించారు. వెను వెంటనే రికార్డులలోనూ మార్పులు చేస్తారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కంటే తహసీల్దార్ కార్యాలయంలో భూ లావాదేవీలు నిర్వహించడం సులువుగా ఉంటుంది. దీని మీద త్వరలోనే రెవెన్యూ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ విదానాన్ని టెర్రా సీఐఎస్ టెక్నాలజీస్ (ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) సంస్థ రూపొందించింది. ఎవరెవరు ఏయే పనులు చేయాలో నిర్ధారించింది. ప్రతి పని ఆన్లైన్ ద్వారానే చేసుకోవచ్చు. ఇంటర్నెట్ పై అవగాహన ఉంటే సొంతంగానే స్లాట్ బుక్ చేసుకోవచ్చు.

చెల్లింపులు..

ఈ చలాన్ ఎవరు చెల్లిస్తున్నారో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. వివరాలు నమోదు చేయాలి. స్టాంపు డ్యూటీ మొత్తం, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీ, పట్టాదారు పుస్తకం చార్జీ, మ్యూటేషన్ చార్జీ, మొత్తం అమౌంట్ ఎంత అనేది వచ్చేస్తుంది. చలాన్ చెల్లించాలో ఆప్షన్లు ఉంటాయి. ఇద్దరు సాక్షుల వివరాలు నమోదు చేయాలి. వాళ్ల పేర్లు, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు తప్పనిసరి. ఇక్కడే స్టాంప్ పేపర్ కొనుగోలు తేదీ, దాన్ని అమలు చేసిన తేదీ వంటివి కూడా నమోదు చేయలి. ఇప్పుడు డాక్యుమెంట్ అప్ లోడ్ చేయాలి. డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత స్లాట్ బుకింగ్ లో అందుబాటులో ఉన్న సమయాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రక్రియ కొనసాగిస్తాడు. తర్వాత జాయింట్ రిజిస్ట్రార్ తన డ్యాష్ బోర్డు ద్వారా ప్రక్రియను నిర్వహిస్తారు.

ప్రక్రియ సాగుతుందిలా..

• మొదట స్లాట్ బుకింగ్ పోర్టల్ కి వెళ్లాలి. అప్లికేషన్ ఫారం పూర్తి చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
• స్టాంపు డ్యూటీ, ఇతర చార్జీలను ఈ చలాన్ ద్వారా కట్టాలి
• తహసీల్దార్ అపాయింట్మెంట్ బుక్ అవుతుంది.
• డేటా ఎంట్రీ ఆపరేటర్ వివరాలను నమోదు చేస్తారు.
• కొనుగోలుదార్లు, అమ్మకందార్లు ఫొటోలు దిగాలి. బయోమెట్రిక్ సంతకాలు చేయాలి
• ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను జాయింట్ రిజిస్ట్రార్ (తహసీల్దార్) ఆమోదిస్తారు.
• డేటా ఎంట్రీ ఆపరేటర్ డాక్యుమెంట్లను స్కాన్ చేస్తారు. వెంటనే అప్ లోడ్ చేసేస్తారు.
• తహసీల్దార్ (జాయింట్ రిజిస్ట్రార్) డాక్యుమెంట్లపై డిజిటల్ సంతకం చేస్తారు. మ్యూటేషన్ పూర్తవుతుంది.

ఇలా చేసుకోవాలి..

• ధరణి వెబ్ సైట్ లో హోం ఆప్షన్ దిగువనే స్లాట్ బుకింగ్ ఉంటుంది. లాగిన్ అయి మొబైల్ నంబరు ఎంటర్ చేస్తే పాస్ వర్డ్, సెక్యూరిటీ కోడ్ వస్తుంది. క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంట ర్ చేయగానే సక్సెస్ అని వస్తుంది. ఆ తర్వాత ఓకే అని బటన్ క్లిన్ చేయాలి
• దరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ (సేల్, గిఫ్ట్ డీడ్) ను ఎంచుకోవాలి. అందులో భాగస్వామ్య పంపకాలు, వారసత్వం (పౌతి) వంటి వాటికి కూడా ఆప్షన్లు ఉన్నాయి.
• ఎలాంటి లావాదేవీయో (నేచర్ ఆఫ్ డీడ్) పూరించాలి. ఆ తర్వాత పట్టాదారు పుస్తకం నంబరు నింపాలి. ఫెచ్ అనే బటన్ క్లిక్ చేయాలి
• వెబ్ సైట్ లో ఖాతా వివరాలు, పట్టాదారు పుస్తకం నంబరు, జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలం, ఊరు వంటివి పూరించాలి
• సర్వే నంబరు, సబ్ డివిజన్ నంబరు నమోదు చేయాలి
• ఒకటి కంటే ఎక్కువ సర్వే నంబర్లను కూడా నమోదు చేయొచ్చు
• ప్రాపర్టీ వివరాలు నమోదు చేసిన తర్వాత ప్రొసీడ్ బటన్ క్లిక్ చేయాలి
• తర్వాత మార్కెట్ విలువ, ఆస్తి సరిహద్దులను నింపాలి. వెబ్ సైట్ లోనే మార్కెట్ విలువ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
పూర్తయ్యాక ప్రొసీడ్ ను క్లిక్ చేయాలి
• పట్టాదారు పుస్తకం ఆధారంగా అమ్మే వ్యక్తి పేరు, ఆధార్ నంబరు, సోషల్ స్టేటస్, జెండర్ వంటి అన్ని వచ్చేస్తాయి
• అమ్మే వ్యక్తి పూర్తి వివరాలను నమోదు చేయాలి. చిరునామాతో సహా అన్నీ నింపాలి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనే బటన్ ను ప్రెస్ చేయాలి
• కొనుగోలు చేసేవారి వివరాలు నమోదు చేయాలి. పాస్ పుస్తకం ఉంటే ఎస్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. భూమికి సంబంధించిన పట్టాదారు పుస్తకం నంబరును ఎంటర్ చేయాలి.
• దాని వల్ల పూర్తి వివరాలు సిస్టమ్ తీసేసుకుంటుంది. దాని ఆధారంగా ఆధార్ నంబరు వచ్చేస్తుంది
• పాస్ పుస్తకం లేకపోతే నమూనాలో అడిగిన వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది
• అమ్మే వ్యక్తి కుటుంబ సభ్యుల వివరాలను కూడా నమోదు చేయాలి. తర్వాత సేవ్ అండ్ నెక్ట్స్ అని క్లిక్ చేయాలి
• కొనుగోలు చేసే వ్యక్తి కుటుంబ వివరాలు కూడా నమోదు చేయాలి
• ఇప్పుడు పేమెంట్ చేయాలి. స్టాంపు డ్యూటీ చెల్లించాలి
• లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలతో రశీదు వస్తుంది. స్టాంపు డ్యూటీ చెల్లింపుల వివరాలు కూడా ఇస్తారు. భూమి వివరాలు కూడా ఉంటాయి.



Next Story

Most Viewed