- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యాపారం పేరిట మోసం… కి‘లేడీ’ అరెస్ట్….
<p>దిశ,పాలేరు: వ్యాపారం పేరిట పలువురిని మోసం చేస్తున్న కిలాడి లేడీని ఖమ్మం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం…నిత్యవసర సరుకులను సరఫరా చేస్తున్నట్లు పలువురిని విజయవాడ భవానినగర్ కు చెందిన పురణం శివకుమారి అనే మహిళ నమ్మించింది. ఈ మేరకు వ్యాపారులకు, రైతులకు ముందుగా డబ్బులు చెల్లించేది. అనంతరం వారి దగ్గర లక్షల్లో అప్పుచేసేది. ఆ తర్వాత డబ్బులు చెల్లించకుండా వారికి కుచ్చుటోపి పెట్టేది. అయితే తాము మోసపోయామని గుర్తించిన కొందరు బాధితులు అమెను నిలదీశారు. […]</p>

X
దిశ,పాలేరు:
వ్యాపారం పేరిట పలువురిని మోసం చేస్తున్న కిలాడి లేడీని ఖమ్మం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం…నిత్యవసర సరుకులను సరఫరా చేస్తున్నట్లు పలువురిని విజయవాడ భవానినగర్ కు చెందిన పురణం శివకుమారి అనే మహిళ నమ్మించింది. ఈ మేరకు వ్యాపారులకు, రైతులకు ముందుగా డబ్బులు చెల్లించేది. అనంతరం వారి దగ్గర లక్షల్లో అప్పుచేసేది. ఆ తర్వాత డబ్బులు చెల్లించకుండా వారికి కుచ్చుటోపి పెట్టేది. అయితే తాము మోసపోయామని గుర్తించిన కొందరు బాధితులు అమెను నిలదీశారు. కాగా డబ్బులు తిరిగి ఇచ్చేందుకు వాయిదాలు పెడుతూ ఆమె తప్పించుకునేది. దీంతో పోలీసులకు ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణ పురానికి చెందిన మాలోతు సునీత అనే మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శివకుమారితో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
Next Story






