- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాచ్‌మెన్‌ను చితకబాదిన యువతి..
<p>దిశ, వెబ్‌డెస్క్: చందానగర్‌లో దారుణం జరిగింది. అపార్ట్‌మెంట్‌లోకి రానివ్వలేదనే కారణంతో ఓ యువతి వాచ్‌మెన్‌ను చితకబాదింది. ఈ ఘటన చందానగర్‌లోని సిరి అపార్ట్‌మెంట్‌లో మంగళవారం చోటుచేసుకుంది. కారులో వచ్చిన ఓ మహిళ అపార్టమెంట్‌లోనికి వెళ్లడానికి ప్రయత్నించింది. అక్కడే ఉన్న వాచెమెన్ ఆ యువతిని అడ్డుకుని.. అనుమతి ఉంటేనే లోనికి పంపిస్తామని తెలిపాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి కారు దిగి వచ్చి వాచ్‌మెన్ మీద విచక్షణా రహితంగా దాడి చేసింది. పిడిగుద్దులు కురిపించడమే కాక కాలితో తన్నింది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చందానగర్‌లో దారుణం జరిగింది. అపార్ట్‌మెంట్‌లోకి రానివ్వలేదనే కారణంతో ఓ యువతి వాచ్‌మెన్‌ను చితకబాదింది. ఈ ఘటన చందానగర్‌లోని సిరి అపార్ట్‌మెంట్‌లో మంగళవారం చోటుచేసుకుంది. కారులో వచ్చిన ఓ మహిళ అపార్టమెంట్‌లోనికి వెళ్లడానికి ప్రయత్నించింది.
అక్కడే ఉన్న వాచెమెన్ ఆ యువతిని అడ్డుకుని.. అనుమతి ఉంటేనే లోనికి పంపిస్తామని తెలిపాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి కారు దిగి వచ్చి వాచ్‌మెన్ మీద విచక్షణా రహితంగా దాడి చేసింది. పిడిగుద్దులు కురిపించడమే కాక కాలితో తన్నింది. ఈ దృశ్యాలన్ని అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో వాచ్‌మెన్ చందానగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






