బ్రూస్‌లీ జయంతికి..ఆర్జీవీ ‘లడ్కీ’ ఫుల్ సాంగ్

by  |
బ్రూస్‌లీ జయంతికి..ఆర్జీవీ ‘లడ్కీ’ ఫుల్ సాంగ్
X

దిశ, వెబ్‌డెస్క్: గెలుపు, ఓటములకు సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ. ఆయనకు ఆలోచన వచ్చిన వెంటనే సినిమా ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడు. అలా ఇటీవలే చాలా సినిమాలు ప్రకటించిన వర్మ, గతేడాది బ్రూస్‌లీ 79వ(నవంబర్ 27, 2019) జయంతి పురస్కరించుకొని ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ చిత్రాన్ని తీయనున్నట్లు ప్రకటించారు. అందులో పూజా బాలేకర్ లీడ్ రోల్ పోషించింది.

బ్రూస్‌లీ హోమ్‌టౌన్ ఫోషన్ (చైనా) సిటీలో డిసెంబర్ 13, 2019లో విడుదల చేస్తానని ప్రకటించాడు. కానీ, ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ విడుదల కాలేదు. మళ్లీ ఏడాది తర్వాత ఆ సినిమాకు సంబంధించిన తొలి సాంగ్ టీజర్ తాజాగా విడుదల చేశాడు. ఆ వీడియో ఫుల్ సాంగ్‌ను బ్రూస్‌లీ 80వ జయంతి రోజున ఈ నెల 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. మార్షియల్ ఆర్టిస్ట్ పూజా బాలేకర్ బ్రూస్‌లీ వీరాభిమానిగా ఈ చిత్రంలో కనిపించనుండగా, ఇండియా తొలి మార్షియల్ ఆర్ట్ చిత్రంగా ఆర్జీవీ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆర్జీవీ హీరోయిన్‌ను ఎలివేట్ చేస్తున్న తీరు ప్రస్తుతానికి చర్చనీయాంశమైంది.



Next Story

Most Viewed