- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నూలులో టీడీపీకి షాక్.. వైసీపీలోకి కీలక నేత
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల వేళ కర్నూలు జిల్లా నంద్యాలలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ కీలక నేత జయచంద్రారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి జయచంద్రారెడ్డికి వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇకపోతే మాజీమంత్రి ఫరూక్ కు ప్రధాన అనుచరుడు అయిన జయచంద్రారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పడంతో జిల్లా వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన చేపట్టిన […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల వేళ కర్నూలు జిల్లా నంద్యాలలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ కీలక నేత జయచంద్రారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి జయచంద్రారెడ్డికి వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇకపోతే మాజీమంత్రి ఫరూక్ కు ప్రధాన అనుచరుడు అయిన జయచంద్రారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పడంతో జిల్లా వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన చేపట్టిన మరుసటి రోజే జయచంద్రారెడ్డి పార్టీ వీడటం ఆ పార్టీలో అలజడి చెలరేగింది. నంద్యాలలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా టీడీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు వెనుకాడుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ గూటికి చేరారు. తాజాగా జయచంద్రారెడ్డి కూడా పార్టీ మారడంతో టీడీపీలో అంతర్మథనం మెుదలైంది.
Next Story






