ఇద్దరికీ కొత్తే.. పేరెంటింగ్ కష్టాలు తప్పలేదు : కునాల్

by  |
Kunal-Kemmu
X

దిశ, సినిమా: కొవిడ్-19 పాండమిక్ వల్ల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్‌ హోమ్ చేయాల్సి రాగా, స్కూళ్లు మూతపడటంతో పిల్లలు ఆన్‌లైన్ క్లాసుల బాటపట్టారు. ఇక లాక్‌డౌన్‌ టైమ్‌లోనే తల్లిదండ్రులకు కొత్తగా పేరెంటింగ్ సమస్యలు కూడా మొదలయ్యాయి. తాజాగా తన మూడేళ్ల కూతురు(ఇనాయా) పెంపకంలో ఎదుర్కొన్న సమస్యల గురించి బాలీవుడ్ యాక్టర్ కునాల్ ఖేము ఓపెన్ అయ్యారు. ఈ విషయంలో తన వైఫ్ సోహా అలీఖాన్ పాత్రను ప్రశంసించాడు. నిజాయితీగా చెప్పాలంటే హోమ్ వర్క్‌తో పాటు ఇనాయాకు సంబంధించిన ప్రతీ విషయం సోహానే చూసుకునేదని తెలిపాడు. అయితే ఇవన్నీ ఓపికగా చేయడం కష్టమన్న కునాల్.. ఇనాయ తమకు మొదటి బిడ్డ కావడంతో పేరెంటింగ్‌లో తమకు అన్నీ కొత్త విషయాలే అని చెప్పుకొచ్చాడు. పిల్లల పెంపకానికి సంబంధించి చుట్టూ ఉన్నవాళ్లు సలహాలు ఇచ్చినప్పటికీ అవన్నీ ఒక్కొక్కరి సొంత అనుభవాల ఆధారంగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. అయితే రెండో బిడ్డ పుడితే ఎలా ఉంటుందో తెలియదన్న కునాల్.. తన ఏజ్ గ్రూప్‌కే చెందినవారికి ఇద్దరు పిల్లలు ఉన్నట్టయితే ఆ తేడా ఏంటో తెలుస్తుందని వెల్లడించాడు.


Next Story