కృష్ణకుమారి పార్ధివ దేహం వద్ద నివాళులర్పించిన కేటీఆర్

by Shyam |

<p>దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణకుమారి మరణించిన విషయం విదితమే. బుధవారం రాజ్ భవన్‌లో కృష్ణకుమారి పార్థివ దేహానికి మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. అలాగే మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి కూడా నివాళులు అర్పించారు. అనంతరం కేటీఆర్ గవర్నర్‌ను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కృష్ణ కుమారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధించారు. ఆయన వెంట ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ‌లు నవీన్, [&hellip;]</p>

కృష్ణకుమారి పార్ధివ దేహం వద్ద నివాళులర్పించిన కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణకుమారి మరణించిన విషయం విదితమే. బుధవారం రాజ్ భవన్‌లో కృష్ణకుమారి పార్థివ దేహానికి మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. అలాగే మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి కూడా నివాళులు అర్పించారు. అనంతరం కేటీఆర్ గవర్నర్‌ను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కృష్ణ కుమారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధించారు. ఆయన వెంట ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ‌లు నవీన్, శంబిపూర్ రాజు, శాసనమండలి చైర్మన్ గోపాల్‌రెడ్డి, సెక్రటరీ నరసింహాచార్యులు తదితరులు ఉన్నారు.

Next Story