కేటీఆర్ కొడంగల్‌ను మర్చిపోయారు.. అందుకే ఈ కార్యక్రమం..

by  |
congress leaders
X

దిశ, కొడంగల్ : కొడంగల్ నుండి తాండూరు వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు గురువారం పాదయాత్ర చేయనున్నట్లు కాంగ్రెస్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ లు తెలిపారు. కాంగ్రెస్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ లు మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న కేటీఆర్ కొడంగల్ ను సిరిసిల్ల, హైదరాబాద్ లా తయారు చేస్తానని చెప్పారన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేటీఆర్ కొడంగల్ ప్రజలకు ముఖం కూడా చూపలేదన్నారు. రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవర్చలేదని, కొడంగల్ నుండి తాండూరు కు వెళ్లె రహదారి గుంతల మయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తాండూరు ఆసుపత్రి కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

రోడ్డు గుంతలమయంగా మారడంతో పరిస్థితి విషమంగా ఉన్న రోగి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉందన్నారు. కొడంగల్ ని కేటీఆర్ దత్తత తీసుకుని చేసిందేమీ లేదన్నారు. కొడంగల్ 50 పడకల ఆస్పత్రిని రేవంత్ రెడ్డి తీసుకువచ్చారన్నారు. కొడంగల్ కనీసం 50 పడకల ఆస్పత్రిని ఇప్పటివరకు ప్రారంభించలేదు అన్నారు. దౌల్తాబాద్, బోంరాస్ పేట్ లలో జూనియర్ కళాశాలలను ఇప్పటి వరకు మంజూరు చేయలేదన్నారు. వెంటనే రెండు మండలాల్లో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. కొడంగల్ నుండి తాండూరు. రావులపల్లి నుండి కస్తూర్ పల్లి వెళ్లే రోడ్లు కూడా చాలా అద్వాన్నంగా ఉన్నాయన్నారు. కొడంగల్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇంటర్వ్యూలు జరిగి చాలా రోజులైనా ఇంతవరకు లోన్ల మాటనే లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, బీసీ సంఘం నాయకులు భీంరాజ్, జీ రాములు, తర్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Next Story