ఆ విషయం తెలిసాక రాత్రి నాకు అస్సలు నిద్ర పట్టలేదు- హీరోయిన్

by  |
ఆ విషయం తెలిసాక రాత్రి నాకు అస్సలు నిద్ర పట్టలేదు- హీరోయిన్
X

దిశ, సినిమా : లేట్ సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మి లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ‘చెహ్రే’ మూవీలో యంగ్ బ్యూటీ క్రిస్టల్ డిసౌజా కూడా నటించింది. కెరీర్ స్టార్టింగ్‌లోనే బిగ్ బీ వంటి లెజెండరీ యాక్టర్‌తో కలిసి పనిచేసే అదృష్టం దక్కించుకున్న క్రిస్టల్.. తాజా ఇంటర్వ్యూలో ఆ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసింది.

అమితాబ్‌తో షూటింగ్‌కు ముందురోజు రాత్రి చాలా నెర్వెస్‌గా ఫీల్ అయ్యానని, అస్సలు నిద్రపట్టలేదని తెలిపింది. పైగా ఎప్పుడూ తన సినిమాల షూటింగ్‌కు రాని మదర్ కూడా సెట్‌కు వస్తాననడంతో టెన్షన్ ఎక్కువైందని వెల్లడించింది. అందుకే బిగ్ బీతో నటించేటప్పుడు తడబడకుండా ఉండేందుకు చాలా ప్రిపేర్ అయినట్టు తెలిపింది. అయితే స్పాట్‌లోకి వచ్చాక.. బచ్చన్ జీ తన భయాలన్నీ పోగొట్టారని, కంఫర్టబుల్‌గా ఉండేలా చేశారని పేర్కొంది. కాగా రూమీ జాఫ్రీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 27న రిలీజైన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed