ఈ రోజుతో డ్రీమ్ ఫుల్ ఫిల్ :కృతి

by  |
ఈ రోజుతో డ్రీమ్ ఫుల్ ఫిల్ :కృతి
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ దివా కృతి సనన్.. కొంతకాలంగా తన కవితలతోనూ అభిమానులను ఇన్‌స్పైర్ చేస్తోంది. లైఫ్‌లో ప్రతీ విషయాన్ని కొత్త కోణంలో చూసే కృతి.. ఏదైనా చేయాలి అనుకుంటే తప్పకుండా చేసి చూపిస్తుంది. ఈ క్రమంలోనే తన కలను సాకారం చేసుకున్నట్లు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది కృతి. ప్రస్తుతం రాజస్థాన్‌లో ‘బచ్చన్ పాండే’ షూటింగ్‌లో పాల్గొంటున్న హీరోయిన్.. పర్‌ఫెక్ట్‌గా బైక్ నడిపిన వీడియో షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ‘అంజానా అంజానీ’ మూవీలోని హైరత్ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుంటే బైక్ నడపాలనేది తన డ్రీమ్ అని.. ఈ రోజుతో అది ఫుల్ ఫిల్ అయిందని తెలిపింది. ‘ఫోర్ వీల్స్ బాడీని మూవ్ చేస్తే.. టూ వీల్స్ సోల్‌ను మూవ్ చేస్తాయి’ అనే కోట్‌తో ఈ వీడియో షేర్ చేసింది కృతి.

ఈ పోస్ట్‌పై స్పందించిన బాలీవుడ్ సెలెబ్రిటీలు వారెవా అంటుంటే.. కృతి ఫ్రెండ్ మాత్రం ఇంతకీ బైక్ ఎప్పుడు నేర్చుకున్నావని అడిగింది. దీనికి సమాధానమిచ్చిన భామ.. ఫస్ట్ డే ట్రైనింగ్ అని చెప్పింది. కాగా నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా కొడుకు సుభన్, కృతికి బైక్ రైడింగ్ నేర్పించాడు.


Next Story