రాధే శ్యామ్: ఆ పాత్రలో కృ‌ష్ణంరాజు.. ‘ఆర్ఆర్ఆర్‌’కు చుక్కలేనా!

by  |
రాధే శ్యామ్: ఆ పాత్రలో కృ‌ష్ణంరాజు.. ‘ఆర్ఆర్ఆర్‌’కు చుక్కలేనా!
X

దిశ, సినిమా : ‘రాధే శ్యామ్’ మూవీ యూనిట్ సూపర్బ్ అప్‌డేట్ ఇచ్చింది. లెజెండరీ యాక్టర్, రెబల్ స్టార్ కృష్ణంరాజు లుక్ రివీల్ చేసింది. కాషాయం దుస్తుల్లో చేతిలో రుద్రాక్ష మాలతో ఆధ్యాత్మికంగా కనిపిస్తున్న కృష్ణంరాజు… పరమహంస పాత్రకు సంబంధించిన లుక్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు. దీంతో అబ్బాయి ప్రభాస్ క్లాసీ లుక్.. పెదనాన్న కృష్ణంరాజు డివోషనల్ లుక్.. కాంబినేషన్ టాలీవుడ్‌లో రికార్డులు తిరగరాయబోతున్నారని అంటున్నారు అభిమానులు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయ్యాక కనీసం నాలుగు నెలల వరకు సినిమాలు రిలీజ్ చేయకపోవడం మంచిదన్న సల్మాన్ ఖాన్ కామెంట్‌పై స్పందించిన ఫ్యాన్స్… ‘నాలుగు నెలలు కాదు వారం రోజులకే వస్తున్నాం తగ్గేదేలే’ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Next Story

Most Viewed