- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వత్తాసు పలికితే ఉద్యోగం ఊడుతది.. జాగ్రత్త : కలెక్టర్ అనుదీప్
<p>దిశ, కొత్తగూడెం: మున్సిపాల్టీలలో అక్రమ కట్టడాలకు వత్తాసు పలికితే టీపీఓల ఉద్యోగం ఊడుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ కమిషనర్లను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి మున్సిపల్ చైర్ పర్సన్లు, కమిషనర్లు, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారులతో పారిశుధ్య కార్యక్రమాలు, హరితహారం, ట్రీ పార్కులు, టీఎస్ బీపాస్, సమీకృత మార్కెట్లు, వైకుంఠదామాలు నిర్వహణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్న స్థలంలో కాకుండా మరొక చోట […]</p>

దిశ, కొత్తగూడెం: మున్సిపాల్టీలలో అక్రమ కట్టడాలకు వత్తాసు పలికితే టీపీఓల ఉద్యోగం ఊడుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ కమిషనర్లను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి మున్సిపల్ చైర్ పర్సన్లు, కమిషనర్లు, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారులతో పారిశుధ్య కార్యక్రమాలు, హరితహారం, ట్రీ పార్కులు, టీఎస్ బీపాస్, సమీకృత మార్కెట్లు, వైకుంఠదామాలు నిర్వహణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్న స్థలంలో కాకుండా మరొక చోట అదే అనుమతితో భవనాలు నిర్మిస్తే అటువంటి నిర్మానాలను అక్రమ కట్టడాలుగా పరిగణించాలని సూచించారు. మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మించిన భవనాలపై వారం రోజుల్లో నివేదికలు అందజేయాలని మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు. అక్రమకట్టడాలపై కఠినంగా వ్యవహరించాలని.. ఉదాసీనంగా వ్యవహరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. భవన నిర్మాణాలపై టీపీఓలు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. పట్టణాల అభివృద్ధిపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తామని మున్సిపల్ అధికారులు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. బతుకమ్మ ఘాట్ల వద్ద విద్యుత్ ఏర్పాటుతో రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగింపుతోపాటు పలు అంశాలపై పలు సూచనలు చేశారు.






