- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోఠి ఉమెన్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ మృతి
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్ : కోఠి ఉమెన్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బీటీ సీత కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణంగా బాధపడుతున్న ఆమె.. మంగళవారం తుదిశ్వాస విడిచారు. బీటీ సీత 2012 నుంచి 2017 వరకు కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. విద్యార్థినులతో పాటు ప్రతి ఒక్కరితో ఎంతో సౌమ్యంగా ఉంటూ కళాశాలలో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ఎంతో కృషి చేశారు. సుమారు మూడేళ్ల క్రితం పదవీ విరమణ చేసిన ఆమె ఇటీవల అమెరికాకు […]</p>

దిశ ప్రతినిధి, హైదరాబాద్ :
కోఠి ఉమెన్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బీటీ సీత కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణంగా బాధపడుతున్న ఆమె.. మంగళవారం తుదిశ్వాస విడిచారు. బీటీ సీత 2012 నుంచి 2017 వరకు కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. విద్యార్థినులతో పాటు ప్రతి ఒక్కరితో ఎంతో సౌమ్యంగా ఉంటూ కళాశాలలో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ఎంతో కృషి చేశారు.
సుమారు మూడేళ్ల క్రితం పదవీ విరమణ చేసిన ఆమె ఇటీవల అమెరికాకు వెళ్లారు. అక్కడ సీత గుండె సంబంధ వ్యాధితో బాధపడుతుండగా కొన్ని రోజుల క్రితం శస్త్ర చికిత్స చేశారు. కాగా, వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమె పరిస్థితి విషమించి మూడు రోజుల క్రితం అమెరికాలోనే కన్ను మూశారు. ప్రొఫెసర్ బీటీ సీత ఇక లేరని తెలిసి కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాలకు ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.






