Bank Interest Rate :గృహ రుణాల పై భారీగా వడ్డీ రేట్లను తగ్గించిన కోటక్ బ్యాంక్..

by Harish |
kotak
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభమైన తరుణంలో ప్రైవేట్ దిగ్గజ కోటక్ మహీంద్రా బ్యాంక్ తన గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు గురవారం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న గృహ రుణ వడ్డీ రేట్లపై 15 బేసిస్ పాయింట్లు తగ్గింపుతో 6.65 శాతం నుంచి 6.50 శాతంగా ఉంటాయని బ్యాంకు తెలిపింది. ఈ ప్రత్యేక తగ్గింపు ఆఫర్ పండుగ సీజన్ కోసం వెల్లడించామని, ఇది సెప్టెంబర్ 10 నుంచి నవంబర్ 8 వరకు అందుబాటులో ఉండనున్నట్టు బ్యాంకు వివరించింది.

వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా ఇళ్ల కొనుగోలుదారులకు సరసరమైన గృహ రుణాలను తీసుకునే వెసులుబాటు ఉంటుందని, అంతేకాకుండా ఈ ప్రత్యేక తగ్గింపు అన్ని రుణ మొత్తాలపై అందుబాటులో ఉంటుందని బ్యాంకు స్పష్టం చేసింది. అయితే, రుణాన్ని తీసుకునే ఖాతాదారుడి క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా రుణాలు నిర్ణయించబడతాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. పండుగ సమయంలో గృహ రుణాలను తీసుకునేవారికి మరింత సౌకర్యవంతమైన వడ్డీతో ఇవ్వాలని, సొంత ఇంటిని నిర్మించుకోవాలనుకునే వారి కలను సాకారం చేయడంలో బ్యాంకు తన వంతు సహకారం అందిస్తుందని ప్రకటించింది.



Next Story

Most Viewed