ఇస్మార్ట్ పార్కింగ్.. కెపాసిటీ ఎంతో తెలుసా?

by Shyam |

<p>దిశ, కూకట్ పల్లి: నగర జీవిది ఉరుకుల పరుగుల జీవితం. పోటీ ప్రపంచంలో నిత్యం పరిగెడుతూనే ఉంటాడు. ఉద్యోగం, వ్యాపారం, చదువు ఏదైనా సరే నగర రహదారులపై వాహనాల్లో ప్రయాణం తప్పనిసరి. నగరంలో వాహనదారుల సంఖ్యకు అనుగుణంగా పార్కింగ్​కేంద్రాలు అందుబాటులో లేవు. దీంతో ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్క్​చేయడంతో ట్రాఫిక్ పోలీసులతో తిప్పలు తప్పడం లేదు. నేరుగా ఈ చలాన్ ఇంటికేవస్తుండడంతో వాహనదారుల జేబులు గుళ్ల అవుతున్నాయి. మరోవైపు పార్కింగ్​చేసిన వాహనాలను దొంగలు ఎత్తుకెళితే అసలుకే మోసం. [&hellip;]</p>

Smart parking
X

దిశ, కూకట్ పల్లి: నగర జీవిది ఉరుకుల పరుగుల జీవితం. పోటీ ప్రపంచంలో నిత్యం పరిగెడుతూనే ఉంటాడు. ఉద్యోగం, వ్యాపారం, చదువు ఏదైనా సరే నగర రహదారులపై వాహనాల్లో ప్రయాణం తప్పనిసరి. నగరంలో వాహనదారుల సంఖ్యకు అనుగుణంగా పార్కింగ్​కేంద్రాలు అందుబాటులో లేవు. దీంతో ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్క్​చేయడంతో ట్రాఫిక్ పోలీసులతో తిప్పలు తప్పడం లేదు. నేరుగా ఈ చలాన్ ఇంటికేవస్తుండడంతో వాహనదారుల జేబులు గుళ్ల అవుతున్నాయి. మరోవైపు పార్కింగ్​చేసిన వాహనాలను దొంగలు ఎత్తుకెళితే అసలుకే మోసం. దీంతో పార్కింగ్​సమస్యపై జీహెచ్​ఎంసీ అధికారులు దృష్టిసారించారు. స్మార్ట్​పార్కింగ్​కేంద్రాలను ఏర్పాచేస్తున్నారు. భాగ్యనగరంలో మొట్టమొదటిసారిగా కూకట్​పల్లిలో పైలట్​ప్రాజెక్టుగా స్మార్ట్​పార్కింగ్​కేంద్రాలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

parking

విదేశీ సాంకేతికతతో..

విదేశీ సాంకేతికతతో నడిచే స్మార్ట్ పార్కింగ్ కేంద్రాన్ని హైదరాబాద్ నగరంలోనే మొట్టమొదటి సారిగా జీహెచ్​ఎంసీ అధికారులు కూకట్ పల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. మారుతున్న సాంకేతికతకు తోడుగా నూతన టెక్నాలజీని వినియోగించి స్మార్ట్ పార్కింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పైలట్ ప్రాజెక్ట్ కింద ఫోరం మాల్ ముందు పార్కింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జంట సర్కిళ్ల పరిధిలో విశాలమైన స్థలం లభిస్తే కార్ పార్కింగ్ కేంద్రం సైతం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె తెలిపారు.

పార్కింగ్ సమస్యకు పరిష్కారం..

జంట నగరాల్లో అత్యంత రద్దీ ప్రదేశం కూకట్ పల్లి. ఎన్నో రకాల వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, అన్ని రకాల వైద్యసేవలు అందించే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్, ఐటీ రంగాలకు కేంద్ర బిందువుగా రూపుదిద్దుకుంది. రోజు కొన్ని లక్షల మంది రాకపోకలు సాగించే కేపీహెచ్​బీ కాలనీ హైటెక్ సిటీ రోడ్డులోని రాజీవ్ సర్కిల్ ఫోరం మాల్ ఎదురుగా ఫ్లై ఓవర్ కింది భాగంలో సుమారు వెయ్యి గజాల విశాల స్థలంలో రూ.48 లక్షల వ్యయంతో స్మార్ట్ పార్కింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సెన్సార్లను వినియోగించి వాహనాలు పార్క్ చేసిన సమయాన్ని లెక్కిస్తారు. సుమారు 200 వాహనాలు పార్క్ చేసే విధంగా పార్కింగ్ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఆహ్లాదకరంగా పార్కు..

స్మార్ట్ పార్కింగ్ కేంద్రం ఎదురుగా ఫ్లైఓవర్ కింది భాగంలో చిన్న పార్కును ఏర్పాటు చేసి ప్రజలు సేద తీరడానికి అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఫోరం మాల్ తో పాటు సమీపంలోని మంజీరా మాల్, కేపీహెచ్​బీకాలనీలోని వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, ఆస్పత్రులకు వచ్చిన వారు తమ బైక్​లను పార్క్ చేసుకునేందుకు వీలుగా రాజీవ్ సర్కిల్ ప్రధాన కూడలిలో స్మార్ట్ పార్కింగ్, పార్కును అభివృద్ధి చేస్తున్నారు.

నగరంలోనే మొదటి సారిగా..

గ్రేటర్ హైదరాబాద్ లోనే మొట్టమొదటి సారిగా స్మార్ట్ పార్కింగ్ కేంద్రాన్ని కూకట్ పల్లి లో పైలట్ ప్రాజెక్ట్ కింద అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. నగరంలో సరియైన పార్కింగ్ సౌకర్యం లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సమస్యకు పరిష్కారంగా స్మార్ట్ పార్కింగ్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. త్వరలో మరిన్ని స్మార్ట్ పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక యాప్ ను సైతం రూపొందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. – వీ మమత, జోనల్ కమిషనర్, కూకట్ పల్లి

పనులు పూర్తి కానున్నాయి..

స్మార్ట్ పార్కింగ్ కేంద్రం వద్ద సివిల్ పనులు పూర్తయ్యాయి. సాంకేతి పరికరాలు అమర్చడం మిగిలి ఉంది. ఇప్పటి వరకు 60 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు స్మార్ట్ పార్కింగ్ కేంద్రం అందుబాటులోకి తీసుకువస్తాం. ఈ పార్కింగ్ కేంద్రంలో 200 బైక్​లు పార్క్ చేసుకునే అవకాశం ఉంది. – నాగేందర్ యాదవ్, ఈఈ, మూసాపేట్ సర్కిల్

Next Story