కొణిదెల నిహారిక వివాహ ఆహ్వాన పత్రిక

11398

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొణిదెల వివాహ ఆహ్వాన పత్రిక వచ్చేసింది. రాజస్థాన్‌లో అంగరంగవైభవంగా జరగనున్న పెళ్లికి అందరూ ఆహ్వానితులే అంటూ మెగా ఫ్యామిలీ పెళ్లి పత్రికను విడుదల చేసింది. ఉదయ్ పూర్‌లోని ఉదయ్ విలాస్ కళ్యాణవేదిక కాగా.. డిసెంబర్ 9న రా. 7:30 నిమిషాలకు మిధునలగ్నంలో జొన్నలగడ్డ చైతన్య నిహారిక మెడలో మూడుముళ్లు వేయనున్నారు. ఇక డిసెంబర్ 11న హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేశారు. రా:7:30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇక పత్రికలో బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మెగా ప్రిన్స్ వరుణ్ కొణిదెల పేర్లను ప్రింట్ చేశారు.

Download Disha App   Android     IOS