- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేత కార్మికుల దీక్షకు కోదండరాం సపోర్టు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన దీక్షకు దిగిన చేనేత కార్మికుల పోరాటాలనికి తెలంగాణ జనసమితి అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరాం మద్దతు పలికారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో చేనేత కార్మికుల నిరసన దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించిన కోదండరాం చేనేత కార్మికులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందరికో సహాయం చేస్తున్నాయని.. […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన దీక్షకు దిగిన చేనేత కార్మికుల పోరాటాలనికి తెలంగాణ జనసమితి అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరాం మద్దతు పలికారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో చేనేత కార్మికుల నిరసన దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించిన కోదండరాం చేనేత కార్మికులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందరికో సహాయం చేస్తున్నాయని.. కానీ, చేనేత కార్మికులను విస్మరిస్తున్నాయని మండిపడ్డారు.
నేత కార్మికులు తమ బతుకు పోరాటం కోసం దీక్షలు చేపట్టడం అభినందనీయమన్నారు. చేనేత కార్మికులు ఇంటిల్లిపాది పనిచేస్తనే కుటుంబం గడుస్తుందని.. కరోనా మూలంగా విధించిన లాక్‌డౌన్ వలన ఇదివరకు నేసిన వస్త్రాలు అమ్ముడుపోక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. వారికి ఏర్పడిన నష్టానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా, ప్రభుత్వానికి కరోనా సమయంలో వచ్చిన విరాళాల లెక్కలు చెప్పాలపి అడిగితే తమను తప్పు పడుతున్నారని కోదండరాం ఆవేదన వ్యక్తంచేశారు.






