కొండా దంపతుల సమక్షంలో ‘కొండా’ షూటింగ్ షురూ

by  |
కొండా దంపతుల సమక్షంలో ‘కొండా’ షూటింగ్ షురూ
X

దిశ, డైనమిక్ బ్యూరో : వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ వరంగల్‌లో సందడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులైన కొండా సురేఖ, కొండా మురళి దంపతుల పై బయో పిక్ తీస్తానాని ఆర్జీవీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రక్త చరిత్ర సినిమాను మించి ఉంటుందని ఆయన చెప్పడంతో ప్రేక్షకులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అయితే, ఇదివరకే వర్మ వరంగల్‌లోని ఎల్.బి కాలేజీలో అధ్యాపకులు, సిబ్బందితో మాట్లాడి కొండా మురళి దంపతుల గురించి తెలుసుకున్నారు. కథ ఇప్పటికే పూర్తి చేసిన వర్మ షూటింగ్ మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వరంగల్‌లోని ఖిల్లా ప్రాంతంలో షూటింగ్ స్పాట్స్ ని గుర్తించారు. కాగా మంగళవారం వరంగల్‌లో కొండా సురేఖ, మురళీధర్ సమక్షంలో మూవీకి సంబంధించి షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. ఈక్రమంలో షూటింగ్ జరిగే ప్రాంతంలో ఆర్జీవీ సందడి చేస్తున్నారు.


Next Story

Most Viewed