- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు తెలంగాణ పీసీసీ చీఫ్ ప్రకటన..?
<p>దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. దానికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పదవికి రాజీనామా చేయడంతో ఆశావహులు జోరుగా జాతీయ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. అదే విషయమై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. అయితే, రేపు(ఆదివారం) కొత్త పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కొత్త […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. దానికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పదవికి రాజీనామా చేయడంతో ఆశావహులు జోరుగా జాతీయ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. అదే విషయమై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. అయితే, రేపు(ఆదివారం) కొత్త పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ కొత్త పీసీసీ రేసులో తన పేరు ముందుంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. తనకు పీసీసీ పదవి అప్పగిస్తే కాంగ్రెస్ శక్తులను ఏకతాటిపైకి తీసుకొస్తానని చెప్పారు. కాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతుగా రాష్ట్ర స్థాయిలో పార్టీ సీనియర్ల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం.






