కేసీఆర్‌కు ప్రేమ లేదు.. వివక్ష ఎందుకు: కోమటిరెడ్డి

by  |
కేసీఆర్‌కు ప్రేమ లేదు.. వివక్ష ఎందుకు: కోమటిరెడ్డి
X

దిశ, హలియా: సీఎం కేసీఆర్‌కి నల్లగొండ జిల్లాపై ప్రేమ లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సాగర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. గుర్రంపోడ్ మండలంలో జానారెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కావాల‌నే న‌ల్లగొండ జిల్లాను చిన్నచూపు చూస్తున్నారన్నారు. అడుగడుగునా జిల్లాకు అన్యాయం చేస్తున్న టీఆర్ఎస్‌కు నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నికల్లో ఓడించి ప్రజలు చెప్పుతో కొట్టిన‌ట్లు బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు. కాళేశ్వరం నీళ్లను కేసీఆర్ ఫాంహౌస్‌కు మళ్లీంచినా.. పక్కనే ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎందుకివ్వలేదని నిలదీశారు. సాగు నీరు కూడా ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని.. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోమటిరెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed