తమిళ నటుడి అర్ధరాత్రి లీలలు.. టీనేజర్స్‌పై సెక్సువల్‌ హరాస్

by  |
తమిళ నటుడి అర్ధరాత్రి లీలలు.. టీనేజర్స్‌పై సెక్సువల్‌ హరాస్
X

దిశ, సినిమా : తమిళ్ యాక్టర్ డానియల్ అన్నీ పోప్ అర్ధరాత్రి లీలల్ని ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ బయటపెట్టారు. మైనర్ గర్ల్స్‌తో లేట్ నైట్ చాట్ చేస్తూ, వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలిపే స్క్రీన్ షాట్స్ షేర్ చేశారు. టీనేజ్ గర్ల్స్‌ను ర్యాండమ్‌గా ఎంచుకుని ఎలాంటి పిక్స్ అడిగేవాడు? 17 ఏళ్ల అమ్మాయితో ఎంత అసభ్యంగా ప్రవర్తించేవాడో? వడివేలు మీమ్స్ వివరించగా.. డానియల్ అండర్ ఏజ్డ్ గర్ల్స్‌ను ఎంతలా వేధిస్తున్నాడో లైవ్ వీడియో ద్వారా వివరించాడు జాసన్ శామ్యూల్. ఈ క్రమంలో ఓ యంగ్ బాయ్‌ను కూడా సెక్సువల్‌గా ఎంత టార్చర్ చేశాడో చెప్పిన జాసన్.. 2014 నుంచి ఇప్పటి వరకు డానియల్ నిర్వాకం గురించి 17 నిమిషాల పాటు లైవ్‌లో వెల్లడించాడు. అంతేకాదు ఓ బాధిత అమ్మాయితో ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడి, ఆడియో ద్వారా సాక్ష్యం ఇప్పించాడు. దుస్తులు చించేసి తీవ్రంగా కొట్టడం, లైంగికంగా వేధించడం లాంటి డానియల్ వికృత చేష్టలపై మరో ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ కూడా లైవ్ వీడియోలో వివరించగా.. సింగర్ చిన్మయి శ్రీపాద వీరికి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇలాంటి వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Next Story

Most Viewed