- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గూడూరు పీఎస్‌లో కొల్లు రవీంద్ర
<p>దిశ, ఏపీ బ్యూరో: మచిలీపట్నానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత మోకా భాస్కర్ హత్య కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర గూడూరు పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు. అజ్ఞాతంలో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయనను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కొల్లు రవీంద్ర గూడూరు పీఎస్‌లో ఉన్నారు. కాసేపట్లో […]</p>

దిశ, ఏపీ బ్యూరో: మచిలీపట్నానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత మోకా భాస్కర్ హత్య కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర గూడూరు పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు. అజ్ఞాతంలో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయనను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కొల్లు రవీంద్ర గూడూరు పీఎస్‌లో ఉన్నారు. కాసేపట్లో ప్రభుత్వాస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఇదిలా ఉంటే ఉదయం 11 గంటలకు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భాస్కరరావు హత్య కేసులో కొల్లు ప్రమేయంపై జిల్లా ఎస్పీ వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం.






