‘కేఎల్ రాహుల్‌కు క్రీడా స్ఫూర్తి లేదు’

by  |
‘కేఎల్ రాహుల్‌కు క్రీడా స్ఫూర్తి లేదు’
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయానికి సంబంధించి కేఎల్ రాహుల్ చేసిన సరదా వ్యాఖ్యలపై అభిమానులు మండిపడుతున్నారు. రెండో వన్డే అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. డేవిడ్ వార్నర్ గాయం ఎక్కువ రోజులు ఉంటే బాగుంటుందని సరదాగా వ్యాఖ్యానించాడు. అలా జరగాలని తాను ఏ క్రికెటర్ విషయంలోనూ కోరుకోను.. అయితే ఆసీస్‌లో కీలక బ్యాట్స్‌మాన్ అయినందునే ఇలా సరదాగ అంటున్నానని రాహుల్ చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు ఈ సరదా వ్యాఖ్యలపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఒక సీనియర్ క్రికెటర్ అయిన రాహుల్ అలా ఎలా వ్యాఖ్యానిస్తాడని అంటున్నారు. ఇదేనా క్రీడా స్ఫూర్తి అంటూ రాహుల్‌పై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా వ్యాఖ్యలతో రాహుల్ తనపై ఉన్న గౌరవన్ని తగ్గించుకున్నాడని ఒక అభిమాని ట్వీట్ చేశాడు. కాఫీ విత్ కరణ్ షో నుంచి రాహుల్ గుణపాఠం నేర్చుకోలేకపోయాడని ఇంకొకరు కామెంట్ చేశారు.

Next Story

Most Viewed