వదులుకుంది డిజాస్టర్ మూవీ.. ఎందుకంత ఫీల్ అవుతుంది?

by  |
వదులుకుంది డిజాస్టర్ మూవీ.. ఎందుకంత ఫీల్ అవుతుంది?
X

దిశ, సినిమా : నటనలోనే కాదు యాక్టింగ్‌లోనూ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఎవరూ బీట్ చేయలేరని అంటోంది హాట్ యాక్ట్రెస్ కిరణ్ రాథోడ్. తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో యాక్టివ్‌గా వర్క్ చేసిన భామ.. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే తాజాగా కమెడియన్ సంతానం హీరోగా వచ్చిన ‘సర్వర్ సుందరం’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భామ.. రజనీకాంత్‌ స్టైల్, మ్యానరిజం గురించి ప్రస్తావిస్తూ పొగడ్తల వర్షం కురిపించింది. తలైవా హీరోగా తెరకెక్కిన ‘బాబా’ సినిమాలో నటించే చాన్స్ వచ్చినా.. ‘జెమిని’ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేకపోయానని చెప్పింది. ఆ మూవీని వదులుకున్నందుకు ఇప్పటికీ ఫీల్ అవుతున్నానన్న భామ.. ‘బాబా’ డిజాస్టర్ అయినా సరే రజనీ పక్కన నటించే అవకాశం రావడమే అదృష్టమని, ఆ లక్కీ చాన్స్ మళ్లీ వస్తుందనే ఆశతో ఉన్నానని వివరించింది.



Next Story

Most Viewed