పంజాబ్ చేతిలో కోల్‌కతా చిత్తు

by  |
పంజాబ్ చేతిలో కోల్‌కతా చిత్తు
X

దిశ, వెబ్‌డెస్క్: షార్జా క్రికెట్‌ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 46వ మ్యాచ్‌లో పంజాబ్ ఘన విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌ పై 8 వికెట్ల భారీ తేడాతో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్ గెలుపొందింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ బ్యాట్స్‌మెన్లు 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (28) పరుగులు చేసి వెనుదిరిగినా.. మందీప్ సింగ్ (65) నాటౌట్, క్రిస్ గేల్ (51) పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌, నికోలస్ పూరన్ (2)‌ నాటౌట్‌గా నిలవడంతో పంజాబ్ విజయం లాంఛనమైంది.

గేల్ మెరుపు ఇన్నింగ్స్.. సమిష్ఠిగా రాణించిన మందీప్: షార్జా స్టేడియంలో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఆకాశమే హద్దుగా ఆడాడు. తొలుత బాల్ టు బాల్ ఆడుతున్న పంజాబ్ జట్టుకు వరుసగా రెండు సిక్సర్లు కొట్టి తన మెరుపు ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టి (51) తన హాఫ్ సెంచరీని పూర్తి చేయడమే కాకుండా.. జట్టును ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఇక తొలి నుంచి సమిష్టిగా రాణించిన మందీప్ సింగ్ 56 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అంతకుముందు ఓపెనింగ్ వచ్చిన కేఎల్ రాహుల్ 25 బంతుల్లో 4 ఫోర్టు కొట్టి 28 పరుగులు చేసి పర్వాలేదనిపించి పెవిలియన్ చేరాడు. చివరి నిమిషంలో మరో మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. క్రిస్ గేల్(51) 147 స్కోరు బోర్డు వద్ద ఫెర్గూసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ (2) నాటౌట్‌గా నిలిచే సరికి పంజాబ్ విజయం లాంఛనమైంది. దీంతో 18.5 ఓవర్లలోనే 150 పరుగుల లక్ష్యాన్ని చేధించి వరుసగా 5 విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ విజయంతో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్ ఫ్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది.

కోల్‌కతా ఇన్నింగ్స్: ఐపీఎల్ 46వ మ్యాచ్‌‌లో టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్‌ చేసిన కోల్‌కతా సాధారణ స్కోరు (149-9) నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రైడర్లు వెంట వెంటనే వికెట్లు కోల్పోయారు. ఓపెనర్ శుబ్ మన్ గిల్ (57), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(40), లోయర్ ఆర్డర్‌లో వచ్చిన లాకీ ఫెర్గూసన్ (24) పరుగులతో రాణించినా.. మిగతా బ్యాట్స్‌మెన్లు పట్టుమని 10 పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 149 పరుగులకే పరిమితం అయింది.

స్కోరుబోర్డు:
Kolkata Knight Riders Innings: 149-9 (20 Ov)
1. శుబ్‌మన్ గిల్ c పూరన్ b షమీ 57(45)
2. నితీష్ రానా c గేల్ b మ్యాక్స్‌వెల్ 0(1)
3. రాహుల్ త్రిపాఠి c రాహుల్ b షమీ 7(4)
4. దినేష్ కార్తీక్ (wk)c రాహుల్ b షమీ 0(2)
5. ఇయాన్ మోర్గాన్ (c)c మురుగన్ అశ్విన్ b రవిభిష్నోయ్ 40(25)
6. సునీల్ నరైన్ b క్రిస్ జోర్డన్ 6(4)
7. కమలేష్ నాగర్‌కోటి b మురుగన్ అశ్విన్ 6(13)
8. ప్యాట్ కమ్మిన్స్ lbw b రవిభిష్నోయ్ 1(8)
9. లాకీ ఫెర్గూసన్ నాటౌట్ 24(13)
10. వరుణ్ చక్రవర్తి b క్రిస్ జోర్డన్ 2(4)
11. ప్రసీద్ కృష్ణ నాటౌట్ 0(1)

ఎక్స్‌ట్రాలు: 6

మొత్తం స్కోరు: 149-9

వికెట్ల పతనం: 1-1 (నితీష్ రానా, 0.2), 10-2 ( రాహుల్ త్రిపాఠి, 1.4), 10-3 ( దినేష్ కార్తీక్, 1.6), 91-4 (ఇయాన్ మోర్గాన్ , 9.5), 101-5 ( సునీల్ నరైన్, 10.6), 113-6 (కమలేష్ నాగర్‌కోటి, 14.2), 114-7 ( ప్యాట్ కమ్మిన్స్, 15.4), 136-8 (శుబ్‌మన్ గిల్, 18.3), 149-9 (వరుణ్ చక్రవర్తి, 19.5).

బౌలింగ్:
1. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2-0-21-1
2. మహ్మద్ షమీ 4-0-35-3
3. అర్ష్‌దీప్ సింగ్ 2-0-18-0
4. మురుగన్ అశ్విన్ 4-0-27-1
5. క్రిస్ జోర్డన్ 4-0-25-2
6. రవి భిష్నోయ్ 4-1-20-2

Kings XI Punjab Innings150-2 (18.5 Ov):

1. కేఎల్ రాహుల్ (c) (wk)lbw b చక్రవర్తి 28(25)
2. మందీప్ సింగ్ నాటౌట్ 66(56)
3. క్రిస్ గేల్ c ప్రసీద్ కృష్ణ b లాకీ ఫెర్గూసన్ 51(29)
4. నికోలస్ పూరన్ నాటౌట్ 2(3)

ఎక్స్‌ట్రాలు: 3

మొత్తం స్కోరు: 150-2

వికెట్ల పతనం: 47-1 (కేఎల్ రాహుల్, 7.6), 147-2 (క్రిస్ గేల్, 18.1).

బౌలింగ్:
1. ప్యాట్ కమ్మిన్స్ 4-0-31-0
2. ప్రసీద్ కృష్ణ 3-0-24-0
3. వరుణ్ చక్రవర్తి 4-0-34-1
4. సునీల్ నరైన్ 4-0-27-0
5. లాకీ ఫెర్గూసన్ 3.5-0-32-1


Next Story